దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండున్నర దశాబ్దాలకు పైగా సినిమాలు తీస్తున్న జక్కన్న ఖాతాలో ఇంతవరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. బాహుబలి సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఇక RRR సినిమాతో అయితే ప్రపంచవ్యాప్తంగా తన పేరు మార్మోగింది. ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడైన రాజమౌళి ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటాడు అనేది ప్రేక్షకులు సస్పెన్స్‌గా మారింది. అయితే తాజాగా ప్రముఖ IMDB సంస్థ డైరెక్టర్ల రెమ్యునరేషన్‌పై నివేదిక ఇచ్చింది.
రాజమౌళి ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలిపింది. ఒక్కో సినిమాకు రూ.200 కోట్ల వరకు తీసుకుంటాడని పేర్కొంది. ఇందులో రెమ్యునరేషన్, ప్రాఫిట్స్ రూపంలో వస్తోందంట. స్టార్ హీరోల కంటే రాజమౌళికే ఎక్కువ రెమ్యునరేషన్ అందుతోందని ఈ నివేదిక వెల్లడించింది. మిగతా డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు తీసుకుంటున్నట్టు నివేదిక తెలిపింది. ఆ తర్వాత సుకుమార్, రాజ్ కుమార్ హిరానీ రూ.80 కోట్ల దాకా తీసుకుంటున్నట్టు వెల్లడించింది.