Rajamouli: టెక్నాలజీ ఎంత పెరిగితే అన్ని అనర్ధాలు అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. నిజమే సోషల్ మీడియా వచ్చాక ఎన్నో అపార్ధాలు జరుగుతున్నాయి. ఎప్పుడో పెట్టిన పోస్టులను కూడా కొంతమంది అదే పనిగా వెతికి తీసి ట్రోల్ చేస్తున్నారు. ఇక కొన్నిసార్లు జీవితంలో ఎవరు ఏ స్థాయికి చేరుకుంటారు అనే విషయాన్ని ఎవరు చెప్పలేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా స్థానం సంపాదించుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు. ఇంకా చెప్పాలంటే రాజమౌళి వల్లే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది.
మన తెలుగు సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నారు అంటే దానికి ముఖ్య కారణం ఎస్ ఎస్ రాజమౌళినే. స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో తెలుగు చిత్రపరిశ్రమకి దర్శకుడుగా పరిచయమయ్యాడు రాజమౌళి. అయితే, రాజమౌళి ఎన్టీఆర్, ప్రభాస్, నితిన్, సునీల్, రాం చరణ్, రవితేజ లాంటి వారిని స్టార్ హీరోలను చేశాడు. కానీ, స్టార్ డం సంపాదించుకున్న హీరోలతో మాత్రం ఇప్పటివరకు ఆయన పని చేయలేదు. ఆయన కెరీర్ లో మొదటిసారి ఒక స్టార్ హీరోతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి.
Also Read – Modi Japan Tour : టోక్యోలో మోదీ మంత్రం: పెట్టుబడుల ప్రవాహానికి పచ్చజెండా!
ఈ మూవీ షూటింగ్ సహా ఇతర వ్యవహారాలలో రాజమౌళి బిజీగా ఉన్నారు. అయితే, ఒకప్పుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా నెటిజనులకు సమాధానం ఇచ్చేవాళ్ళు. జక్కన్న ట్విట్టర్ ద్వారా అప్పట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారడం ఆశ్చర్యకరం. ఓ నెటిజన్ రాజమౌళిని ట్యాగ్ చేస్తూ.. మీతో పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సినిమా చేయడు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు, ఐటెం సాంగ్స్ ఉండవు.. అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. దానికి రాజమౌళి స్పందిస్తూ.. ‘మీరు చెప్పింది నిజమే బ్రదర్. అది కూడా కరెక్ట్ కావచ్చు. కానీ వీటన్నిటి మధ్యలో బంగారం సినిమాలో సుబ్బులు పాట విన్నారా.? అదేంటి భక్తిగీతమా..? అంటూ ఆ నెటిజన్ కు సమాధానం ఇచ్చాడు.
ఇప్పటి వరకూ, రాజమౌళిపై ఒకే ఒక్క కంప్లైంట్ ఉండేది. రాజమౌళి పనిచేసిన హీరోలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పనిచేయరు అని, అలాగే.. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన హీరోలతో రాజమౌళి సినిమా చేయరు అని. గతంలో ఈ కామెంట్స్ బాగా వినిపిస్తూ ఉండేవి. అంతేకాదు, ఎన్టీఆర్ తోనే రాజమౌళి ఎక్కువ సినిమాలు చేస్తాడని కూడా మాట్లాడుకునేవాళ్ళు. కానీ, ఆ లెక్కలన్నీ ఇప్పుడు తారుమారయ్యాయి. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత వీర రాఘవ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నారు. కథ, కథనాలు నిర్మాతతో పాటు హీరో, డైరెక్టర్ కాంబినేషన్ కుదరాలే.. కానీ ఎవరితో ఎవరైనా సినిమా చేయొచ్చు అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.
Also Read – Pinnelli Brothers:పిన్నెల్లి సోదరులకు షాక్ ఇచ్చిన హైకోర్టు..!


