Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభRajamouli: మహేష్‌తో తీయబోయే సినిమా ఇండియానా జోన్స్‌లా అడ్వెంచరస్ సినిమా..

Rajamouli: మహేష్‌తో తీయబోయే సినిమా ఇండియానా జోన్స్‌లా అడ్వెంచరస్ సినిమా..

RRR సినిమా తర్వాత రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయిపోయారు. RRR సినిమాని హాలీవుడ్ లో మరింత ప్రమోట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయి చాలా రోజులు అవుతున్నా ఇంకా RRR సినిమా మాయలోనే ఉన్నాడు రాజమౌళి. ఆ క్రేజ్ కూడా అలాగే ఉంది.

- Advertisement -

ఇక హాలీవుడ్ లో అక్కడి మీడియాతో, ప్రేక్షకులతో మాట్లాడుతున్నాడు రాజమౌళి. ఈ సందర్భంలో అనేక విషయాలని తెలియచేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ తో తీయబోతున్నట్టు, అది గ్లోబల్ అడ్వెంచరస్ సినిమా అని తెలిపాడు. అయితే ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ అవ్వలేదని మహేష్ అభిమానులు భాదపడుతున్నారు. మరోసారి రాజమౌళి మహేష్ తో తీయబోయే సినిమా గురించి మాట్లాడి మహేష్ అభిమానులకి జోష్ ఇచ్చాడు.

తాజాగా ఓ హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. ”నా నెక్స్ట్ సినిమా ప్రస్తుతం రైటింగ్ స్టేజిలోనే ఉంది. నేను, మా నాన్న, మరికొంతమంది రైటర్స్ కలిసి ఈ సినిమా కథ మీద వర్క్ చేస్తున్నాం. ఇది ఒక అడ్వెంచరస్ సినిమాలా, ఇండియానా జోన్స్ టైప్ లో, ట్రావెలింగ్ తో కలిసి ఉంటుంది. నాకు చిన్నప్పటి నుండి అలాంటి సినిమాలు ఇష్టం. అలాంటి కథని తీసుకొని దానిమీద వర్క్ చేస్తున్నాం” అని తెలిపారు. దీంతో మహేష్ అభిమానులు ఇప్పట్నుంచే సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News