భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులపై భారత ఆర్మీకి అండగా నిలబెడుతూ సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(Rajamouli) ఎక్స్ వేదికగా ప్రజలకు కీలక సూచనలు చేశారు.
భారతదేశాన్ని ఉగ్రవాదం నుంచి కాపాడుతున్న ధైర్యవంతులైన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేశారు. ఒక దేశంగా మన అందరం కలిసి నిలబడి వారి ధైర్యంతో శాంతి, ఐక్యతతో కూడిన భవిష్యత్తుని నిర్మించుకుందామన్నారు. ఇందుకోఉసం ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు తీసి షేర్ చేయకండపి విజ్ఞప్తి చేశారు. అలాగే పుకార్లను, అసత్య వార్తలను ప్రచారం చేయకండని పిలుపునిచ్చారు. విజయం మనదే జైహింద్ అంటూ వెల్లడించారు. మరోవైపు కేంద్రం కూడా ఆర్మీక సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ప్రసారం చేయకండని మీడియా, సోషల్ మీడియా ఛానల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.