Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభRajamouli: హాలీవుడ్ లో సినిమా చేయటమే కల: రాజమౌళి

Rajamouli: హాలీవుడ్ లో సినిమా చేయటమే కల: రాజమౌళి

పాశ్చాత్య దేశాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాతో దుమ్ములేపిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన మనసులో మాట ఎట్టకేలకు బయటకు పెట్టారు. అంతర్జాతీయ వేదికపై సక్సస్ ఎంజాయ్ చేసిన జక్కన్న.. తనకు హాలీవుడ్ లో సినిమా తీయాలన్నది అతి పెద్ద కల అంటూ వెల్లడించారు. ఏ దర్శకుడికైనా హాలీవుడ్ లో సినిమా తీయటం అనే కల ఉంటుందన్నారు. ఇందుకు తానేమీ మినహాయింపు కాదని, ప్రయోగాలకు తాను సదా సిద్ధం అంటూ రాజమౌళి వివరించారు. ఇండియాలో తాను డిక్టేటర్ అన్న జక్కన్న తనకు ఇక్కడెవరూ ఎలా సినిమా తీయాలో చెప్పరన్నారు.

- Advertisement -

కాగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు కూడా తమకు హాలీవుడ్ పై ఇంట్రెస్ట్ ఉన్న విషయాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. అయితే తారక్ తో హాలీవుడ్ సినిమాలు తీసేందుకు చాలామంది డైరెక్టర్స్ డిస్కషన్స్ లో ఇప్పటికే తలమునకలై ఉన్నారు. అమెరికన్, బ్రిటీష్ ఆర్టిస్టులు, మీడియాను ఆకట్టుకున్న రాజమౌళి బృందం గోల్డెన్ గ్లోబ్స్ తో సత్తా చాటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News