Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభBest Director : RRRతో రాజమౌళికి మరో హాలీవుడ్ అవార్డు..

Best Director : RRRతో రాజమౌళికి మరో హాలీవుడ్ అవార్డు..

Rajamouli : RRR సినిమాతో రాజమౌళి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిపోయారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా అందరూ రాజమౌళిని, RRR సినిమాని అభినందిస్తూనే ఉన్నారు. ఇక గత కొన్ని నెలలుగా రాజమౌళి అమెరికాలోనే ఉండి హాలీవుడ్ లో తన RRR సినిమాని తెగ ప్రచారం చేశారు. అక్కడి మీడియాతో, ప్రేక్షకులతో మాట్లాడారు. హాలీవుడ్ లోని పలు ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొని పలు పురస్కారాలు అందుకున్నారు.

- Advertisement -

హాలీవుడ్ వేదికపై అక్కడి ప్రముఖులు రాజమౌళిని, ఆయన టేకింగ్ ని పొగిడేస్తున్నారు. కొన్ని రోజులక్రితం ఓ హాలీవుడ్ అవార్డు సాధించారు రాజమౌళి. ఇటీవలే లాస్ ఏంజిల్స్ టైమ్స్ పేపర్ లో రాజమౌళి గురించి స్పెషల్ ఆర్టికల్ రాశారు. తాజాగా RRR సినిమాకి గాను హాలీవుడ్ లో రాజమౌళికి మరో అవార్డు దక్కింది.

న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌(NYFCC) హాలీవుడ్ లో ప్రపంచవ్యాప్తంగా వచ్చే బెస్ట్ సినిమాలకి అవార్డులు ఇస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం అవార్డులని తాజాగా ప్రకటించింది. ఈ అవార్డుల్లో RRR సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని ఎంపిక చేసింది. ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా రాజమౌళి నిలిచాడు. దీంతో ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు రాజమౌళిని అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News