Tuesday, March 25, 2025
Homeచిత్ర ప్రభడేవిడ్ వార్నర్ కు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు.. ఎందుకంటే..?

డేవిడ్ వార్నర్ కు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు.. ఎందుకంటే..?

రాబిన్ హుడ్ ప్రీ-రిసీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, “రేయ్ డేవిడ్, వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే.. పుష్ప స్టెప్పులు వేస్తావా? నువ్వు మామూలోడివి కాదు రోయ్ వార్నర్!” అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఈ వ్యాఖ్యలను విమర్శిస్తూ, అంతటి అనుభవం ఉన్న నటుడు ఎందుకు ఇలా మాట్లాడారని ప్రశ్నించారు. ఈ వివాదం పెద్దదవుతుండడంతో, రాజేంద్రప్రసాద్ స్వయంగా స్పందించారు.

- Advertisement -

తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “రాబిన్ హుడ్ ఈవెంట్‌లో సరదాగా మాట్లాడినప్పుడు నా నోటినుండి కొన్ని మాటలు వచ్చాయని.. అవి ఉద్దేశపూర్వకంగా అన్నవి కావని.. వార్నర్‌ను చిన్న పిల్లాడిలా చూస్తానని.. తాము రాబిన్ హుడ్ సినిమా సమయంలో సరదాగా గడిపామన్నారు. ఎవరినైనా అపార్థం కలిగించి ఉంటే నన్ను క్షమించండి అంటూ స్పష్టీకరణ ఇచ్చారు.

ఈ వివాదం ముగిసిపోవాలని కోరుతూ, మార్చి 28న థియేటర్లలో రాబిన్ హుడ్ సినిమాను తప్పకుండా చూడాలని ఆయన ప్రేక్షకులను ఆహ్వానించారు. నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News