Coolie Business: సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద రికార్డుల పండుగే. భారతదేశంలోనే అత్యంత భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్‌గా దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ హవా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన టైటిల్ పాత్రలో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ (Coolie) ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గటే సినిమా అంచనాలకు మించి దూసుకుపోతోంది. విడుదలకు ముందే ఈ చిత్రం సృష్టించిన సంచలనం సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
‘కూలీ’ చిత్రం విడుదలకు ముందే ఇప్పటికే 250 కోట్లు వసూలు చేసి ఒక సంచలనం సృష్టించింది. దాదాపు రూ. 375 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ‘కూలీ’ మొత్తంగా 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకూ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన ‘లియో’ (Leo) రికార్డులను కూడా అధిగమించింది.
భారీ మల్టీస్టారర్, రజనీ కెరీర్ బెస్ట్ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ‘కూలీ’ ఒకటి. రజనీకాంత్, నాగార్జున (Nagarjuna), అమీర్ ఖాన్ (Aamir Khan), ఉపేంద్ర (Upendra), శ్రుతిహాసన్ (Shruti Haasan) వంటి స్టార్లతో కూడిన అతి పెద్ద మల్టీస్టారర్ చిత్రంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఏడు పదుల వయసును అధిగమించినా రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేస్తూ, నిరంతరం మీడియా హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. “జైలర్” (Jailer) సంచలన విజయం సాధించగా, ఇప్పుడు ‘కూలీ’ రజనీ కెరీర్ బెస్ట్‌గా నిలుస్తుందని సూచనలు అందాయి.
డిజిటల్, శాటిలైట్, ఇంటర్నేషనల్ డీల్స్ కూలీ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో భారీ మొత్తాలను నిర్మాతలకు తెచ్చిపెట్టింది. ఈ సినిమా డిజిటల్, మ్యూజిక్, శాటిలైట్ హక్కుల అమ్మకం ద్వారా ఇప్పటికే రూ. 250 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతర్జాతీయ హక్కుల రూపంలో 68 కోట్ల డీల్ కుదిరింది. ఇప్పటివరకూ తమిళంలో ఇది రెండో అతిపెద్ద డీల్ అని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఇప్పటికే విదేశాలలో ప్రీ రిలీజ్ బుకింగ్‌ల ద్వారా ‘కూలీ’ రూ. 30 కోట్లు రాబట్టింది. దీనితో ఈ చిత్రం అంతర్జాతీయ మార్కెట్లలో తమిళ చిత్రానికి అతిపెద్ద ఓపెనింగ్‌ను సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ‘లియో’ ఓవర్సీస్ టెరిటరీ నుండి మొదటి రోజు రూ. 66 కోట్లు వసూలు చేయగా, ‘కూలీ’ అంతకుమించి వసూలు చేయబోతోందని అంచనా.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/prabhas-pan-india-movie-the-raja-saab-new-release-date/
‘కూలీ’ చిత్రం ఆగస్టు 14న అత్యంత క్రేజీగా విడుదలవుతోంది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 36 సంవత్సరాల తర్వాత రజనీకాంత్ నటించిన తొలి A రేటింగ్ మూవీగా ‘కూలీ’ గురించి చర్చ సాగుతోంది. దక్షిణాదితో పాటు ఉత్తరాదినా ‘కూలీ’ ప్రభంజనం సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ ఫ్యాక్టర్ తో ఇప్పుడు ఉత్తరాదినా “కూలీ”కి బజ్ నెలకొందని ట్రేడ్ చెబుతోంది. తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, కేరళలో మార్నింగ్ షోస్ భారీగా ప్లాన్ చేస్తున్నారు, దీని ద్వారా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/jr-ntr-powerful-speech-in-war-2-pre-release-event/
ప్రీ-రిలీజ్ వసూళ్లతోనే సంచలనం సృష్టించిన ‘కూలీ’ రజనీకాంత్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.


