Coolie Movie: రజనీకాంత్ కూలీ మూవీ నెగెటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోంది. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 500 కోట్ల కలెక్షన్స్ దాటేసింది. 12 రోజుల్లోనే ఈ ఘనతను సాధించింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువలో ఈ మల్టీస్టారర్ మూవీ నిలిచింది.
మూడో మూవీ…
రజనీకాంత్ కెరీర్‌లోనే అత్యధక కలెక్షన్స్ రాబట్టిన మూడో మూవీగా కూలీ నిలిచింది. ఈ లిస్ట్‌లో 2.ఓ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా…జైలర్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఐదు వందల కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించిన రజనీకాంత్ మూడో సినిమా కూడా కూలీనే కావడం గమనార్హం. ఓవరాల్‌గా తమిళ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న మూవీస్ లిస్ట్‌లో కూలీ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నది.
Also Read- Mirai and Mass Jathara: అఫీషియల్….రవితేజ మాస్ జాతర పోస్ట్‌పోన్ – మిరాయ్ రిలీజ్ డేట్ ఛేంజ్
ఓవర్‌సీస్‌లో బ్రేక్ ఈవెన్…
ఇప్పటికే ఓవర్‌సీస్‌లో బ్రేక్ ఈవెన్‌ను సాధించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ప్రాఫిట్ జోన్ దగ్గరలో ఉంది. తెలుగులో నలభై ఆరు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ 12 రోజుల్లో 41 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. తెలుగు వెర్షన్ క్లీన్ హిట్‌గా నిలవాలంటే మరో ఐదు కోట్ల కలెక్షన్స్ రాబట్టాల్సివుంది. వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు మరో అరవై కోట్ల దూరంలో నిలిచింది.
వినాయకచవితి హాలీడేస్ రావడం, పోటీగా పెద్ద సినిమాలేవి లేకపోవడం సెకండ్ వీక్‌లో కూలీకి కలిసిరావచ్చునని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్‌సీస్‌తో పాటు తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కూలీ ప్రభంజనం ఎక్కువగా కనిపిస్తోంది. హిందీతో పాటు కేరళ, కర్ణాటకలో కూలీ మోస్తారు వసూళ్లను మాత్రమే దక్కించుకున్నది.
లోకేష్ కనగరాజ్ డైరెక్టర్…
కూలీ మూవీకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో నాగార్జున, మలయాళం నటుడు సౌబీన్ సాహిర్ విలన్స్‌గా కనిపించారు. ఉపేంద్రతో పాటు బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియన్ స్టార్స్ అందరూ కలిసి నటించిన ఈ మూవీపై రిలీజ్‌కు ముందు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకపోవడంతో ఆ అంచనాలకు అందుకోలేకపోయింది. స్టోరీ పరంగా లోకేష్ కనగరాజ్ కెరీర్‌లోనే వీక్ మూవీ ఇదంటూ విమర్శలు వచ్చాయి. నాగార్జున క్యారెక్టర్‌ను స్టైలిష్‌గా చూపించారు. కానీ ఆయన పాత్రలో డెప్త్ లేకపోవడంతో అభిమానులు డిసపాయింట్ అయ్యారు. కూలీ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.


