సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘కూలీ'(Coolie). ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై హైప్ తెచ్చాయి. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా మూవీని విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్(NTR) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వార్ 2’ సినిమా యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాను కూడా ఆగస్టు 14న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు అదే తేదీకి రజనీకాంత్ ‘కూలీ’ కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద క్లాష్ ఏర్పడనుంది.