Aamir khan: కూలీ సినిమా రిజల్ట్ లోకేష్ కనగరాజ్‌కు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. మొన్నటివరకు లోకేష్‌తో సినిమా చేయడానికి ఆసక్తిని చూపిన స్టార్ హీరోలు ఇప్పుడు సైడ్ అయిపోతున్నారు. లోకేష్ కనగరాజ్‌తో ఆమిర్ ఖాన్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే కూలీ ఫెయిల్యూర్‌తో ఈ మూవీ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
భారీగా హైప్…
రిలీజ్‌కు ముందు కూలీ మూవీపై పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా హైప్ వచ్చింది. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ ఫస్ట్ టైమ్ కలిసి సినిమా చేయడం, నాగార్జున మొదటిసారి విలన్ పాత్రను చేస్తుండటం, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర గెస్ట్ రోల్స్… ఇలా ఎన్నో ప్రత్యేకతల నడుమ కూలీ థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టోరీలో దమ్ము లేకపోవడం, పేలవమైన క్యారెక్డర్స్ డిజైనింగ్ కారణంగా సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. లోకేష్ సినిమాల్లో ఉండే థ్రిల్లు, మ్యాజిక్ కూలీలో అస్సలు కనిపించలేదు. ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర పాత్రలకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదని, నాగార్జున పాత్రను పవర్‌ఫుల్‌గా రాసుకోలేకపోయాడంటూ లోకేష్ కనగరాజ్‌పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి.
Also Read – Bigg Boss Voting: మారిపోయిన ఓటింగ్ స్థానాలు.. టాప్ లో కమెడియన్.. లీస్ట్ లో హీరోయిన్, కొరియోగ్రాఫర్
ఆమిర్ స్టేట్‌మెంట్…
కూలీ సినిమా చేయడం తన కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్ అంటూ ఆమిర్‌ఖాన్ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ బాలీవుడ్‌లో వైరల్ అవుతుంది. “రజనీకాంత్ కోసమే కూలీలో గెస్ట్ రోల్ చేశాను. నా పాత్ర ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే ఫన్ రోల్ అవుతుందనుకున్నా. కానీ కంప్లీట్ మిస్ ఫైర్ అయ్యింది. కూలీలో నా క్యారెక్టర్‌కు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. రెండు డైలాగ్స్ చెప్పి అదృశ్యమైనట్లుగా అనిపించింది. యాక్టింగ్ పరంగా నా క్రియేటివిటీ చూపించడానికి అవకాశం లభించలేదు అలా ఉంటుందని నేను అనుకోలేదు. కూలీ సినిమా చేయడం నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్‌గా భావిస్తున్నా. సినిమాల పరంగా భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని ఈ సినిమాతో అర్థమైంది” అంటూ ఆమిర్‌ఖాన్ చెప్పినట్లుగా ఓ వీడియో బైట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చాలా మంది నెటిజన్లు ఆమిర్ నిజంగానే ఈ మాటలు చెప్పాడని అంటున్నారు. మరికొంత మంది మాత్రం ఫేక్ వీడియోగా పేర్కొంటున్నారు.
సూపర్ హీరో మూవీ…
కూలీ రిలీజ్‌కు ముందు లోకేష్ కనగరాజ్‌తో ఓ సూపర్ హీరో సినిమా చేయబోతున్నట్లు ఆమిర్ ఖాన్ పేర్కొన్నడు. కూలీ డిజాస్టర్ కావడంతో ఆమిర్, లోకేష్ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్‌లో అడుగుపెట్టడానికి ముందే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ కావాలని లోకేష్ కనగరాజ్‌ను ఆమిర్‌ఖాన్ ఆడిగాడట. షూటింగ్‌లోనే సీన్స్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ సినిమా చేయడం లోకేష్ స్టైల్. కానీ ఈ ఫార్ములా కూలీ విషయంలో వర్కవుట్ కాలేదు. ఈ విషయంలో ఆమిర్‌ఖాన్, లోకేష్ కనగరాజ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో లోకేష్ సినిమాను ఆమిర్ పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్, కమల్‌హాసన్ కలయికలో రాబోతున్న మల్టీస్టారర్ మూవీ నుంచి లోకేష్ కనగరాజ్‌ను తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read – Gold Price: కేవలం రూ .1 కే బంగారం .. ఎక్కడో తెలుసా ?


