Kamal Haasan: లెజెండరీ హీరోలు కమల్‌హాసన్, రజినీకాంత్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ రానున్నట్లు కోలీవుడ్‌లో కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. మల్టీస్టారర్ చేస్తుంది నిజమేనంటూ రజినీకాంత్‌తో పాటు కమల్‌హాసన్ కూడా ప్రకటించారు. దాదాపు నలభై ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రజినీకాంత్, కమల్‌హాసన్ కలిసి సినిమా చేస్తుండటంతో ఈ మల్టీస్టారర్ మూవీపై అభిమానుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు మొదలయ్యాయి. రజినీకాంత్, కమల్‌హాసన్ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. తొలుత ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలొచ్చాయి. కూలీ డిజాస్టర్ ఎఫెక్ట్‌తో లోకేష్ ఈ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడు. తాజాగా రజినీకాంత్, కమల్‌హాసన్ మల్టీస్టారర్ మూవీకి జైలర్ ఫేమ్ నెల్సన్ డైరెక్టర్‌గా కన్ఫామ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కమల్‌హాసన్ స్వయంగా నిర్మించబోతున్నారు.
Also Read – Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ పోస్ట్‌పోన్ రూమర్స్‌పై క్లారిటీ – చెప్పిన డేట్‌కే వచ్చేస్తోంది!
నవంబర్ 7న తన బర్త్‌డే సందర్భంగా రజినీకాంత్ మూవీపై కమల్‌హాసన్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రకటన మల్టీస్టారర్ మూవీకి సంబంధించినంది కాదట. వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమాతో పాటు రజినీకాంత్ సోలో హీరోగా కమల్‌హాసన్ ఓ సినిమాను నిర్మించబోతున్నారట. ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలొస్తున్నాయి. లిమిటెడ్ బడ్జెట్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రజినీకాంత్, డైరెక్టర్ సుందర్ మూవీ ఉండబోతుందట. కమల్‌హాసన్ బర్త్‌డే రోజు అనౌన్స్ చేసి ఐదారు నెలల్లో షూటింగ్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. సుందర్ సి సినిమా పూర్తయిన తర్వాత నెల్సన్ డైరెక్షన్‌లో కమల్‌హాసన్‌తో రజినీకాంత్ మల్టీస్టారర్ మొదలుకానున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. జైలర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. విద్యా బాలన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌తో పాటు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జూన్ 12న జైలర్ 2 రిలీజ్ కాబోతుంది. మరోవైపు ఫైట్ మాస్టర్స్ అన్భు అరివు డైరెక్షన్‌లో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు కమల్‌హాసన్. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.
Also Read – Train Accident: గూడ్స్ రైలును ఢీకొన్న ప్యాసింజర్.. ఆరుగురు మృతి


