రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. డివైడ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న ఈ మూవీ 400 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. కూలీ తర్వాత మరోసారి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
మల్టీస్టారర్ మూవీ…
కూలీ టాక్‌తో సంబంధం లేకుండా నెక్స్ట్ మూవీ కోసం లోకేష్ కనగరాజ్ ఓ మల్టీస్టారర్ స్టోరీని సిద్ధం చేసుకున్నాడట. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు కమల్‌హాసన్ హీరోలుగా నటించనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
Also Read: Mokshagna : మోక్షజ్ఞ లవ్ స్టోరీ చూడాలనుకుంటున్నా – నారా రోహిత్
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ…
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా కథాంశంతో ఈ మల్టీస్టారర్ మూవీ రూపొందనున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్, కమల్‌హాసన్ ఏజ్‌డ్ గ్యాంగ్‌స్టర్స్‌గా కనిపిస్తారట. స్వీయ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్ స్వయంగా ఈ మల్టీస్టారర్ సినిమాను నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కూలీ మాదిరిగా పాన్ ఇండియన్ యాక్టర్స్ కాకుండా ఇందులో కేవలం కోలీవుడ్ నటీనటులు మాత్రమే కనిపిస్తారట.. ప్యూర్ తమిళ్ నేటివిటీకి తగ్గట్లుగా లోకేష్ కగనరాజ్ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
46 ఏళ్ల తర్వాత…
దాదాపు 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి సినిమా చేయబోతుండటం తమిళ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కెరీర్ ఆరంభంలో రజనీకాంత్, కమల్‌హాసన్ కలయికలో అపూర్వ రాగంగల్, మూండ్రు ముడిచ్చు, పథినారు వయనిథిలే, అవారాగల్ లాంటి సినిమాలొచ్చాయి. 1979లో రిలీజైన అలావుద్దీన్ అద్భుత విలక్కుమ్ రజనీకాంత్, కమల్‌హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన చివరి మూవీ. మళ్లీ ఈ దిగ్గజ హీరోలు లోకేష్ కనగరాజ్ మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత అభిమానుల ముందుకు రాబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read: Telangana : తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ నోటిఫికేషన్
ఖైదీ 2 వెనక్కి…
కూలీ తర్వాత లోకేష్ కనగరాజ్ కార్తీతో ఖైదీ 2ను తెరకెక్కిస్తారని కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. కానీ రజనీ, కమల్ మల్టీస్టారర్ కోసం ఖైదీ2ను లోకేష్ వాయిదావేసినట్లు సమాచారం. మల్టీస్టారర్ మూవీ పూర్తయిన తర్వాతే ఖైదీ సీక్వెల్‌ను మొదలుపెట్టాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
2014లో రిలీజైన ఖైదీతో లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్‌గా మారాడు. కార్తీ హీరోగా నటించిన ఈ మూవీ 130 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.


