Rajinikanth: సినిమాకు పబ్లిసిటీనే కీలకం. ఎంత పెద్ద స్టార్ మూవీ అయినా ప్రమోషన్స్ లేకుండా సినిమా ఆడటం ప్రస్తుతం కష్టంగా మారింది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ఓ వారధిగా ప్రమోషన్స్ ఉపయోగపడతాయి. మోడ్రన్ టెక్నాలజీతో తీయడం ఈజీనే. కానీ దానిని జనాల్లోకి తీసుకెళ్లడమే దర్శక నిర్మాతలకు పెద్ద ఛాలెంజింగ్. వెరైటీ ప్రమోషన్స్‌తో తమ సినిమాను ఆడియెన్స్‌లోకి తీసుకెళ్లాలని మేకర్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రమోషన్స్‌లో టీజర్స్, ట్రైలర్స్ కీలకం. సినిమా ఎలా ఉండబోతుంది, కంటెంట్, జానర్ ఏమిటి, హీరోలను ఎలా చూపించబోతున్నది ఆడియెన్స్ చెబుతూ వారిలో సినిమా పట్ల ఎగ్జైట్‌మెంట్, క్యూరియాసిటీను కలిగించడానికి ఈ టీజర్స్, ట్రైలర్స్ ఉపయోగపడతాడు. టీజర్, ట్రైలర్స్ లేకుండా సినిమా ప్రమోషనే ఉండదు. ఒక్కో సినిమాకు వివిధ పేర్లతో రెండు, మూడు ట్రైలర్స్ రిలీజ్ చేస్తున్నారు.
సర్‌ప్రైజ్….
కానీ రజనీకాంత్ కూలీ మేకర్స్ మాత్రం ఫస్ట్ టైమ్ ఓ వెరైటీ ప్రయోగంతో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేయబోతున్నట్లు తెలిసింది. టీజర్, ట్రైలర్ లేకుండా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. థియేటర్లలో ఆడియెన్స్ సర్‌ప్రైజ్‌గా ఫీలవ్వాలంటే టీజర్స్, ట్రైలర్ రిలీజ్ చేయకపోవడమే మంచిదనే ఆలోచనలో డైరెక్టర్ లో లోకేష్ కనగరాజ్ ఉన్నట్లు చెబుతోన్నారు. రజనీకాంత్‌తో పాటు మిగిలిన స్టార్ హీరోల క్యారెక్టర్స్, వారి లుక్స్‌తో పాటు కథేమిటన్నది ఏ మాత్రం రివీల్ చేయకుండా ఓ సస్పెన్స్‌ను క్రియేట్ చేసి ఆడియెన్స్‌ను థ్రిల్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
అందులో భాగంగానే టీజర్, ట్రైలర్స్ లాంటివి లేకుండా కొత్త ప్రయోగం చేయాలని ఫిక్సైనట్లు తెలిసింది. డైరెక్టర్ ఆలోచనకు రజనీకాంత్ కూడా ఇంప్రెస్ అయినట్లు చెబుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించిన వాటిలో కేవలం ప్రోమోలు మాత్రమే చూపించబోతున్నట్లు తెలిసింది.పాన్ ఇండియన్ స్టార్…
యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో పాన్ ఇండియన్ స్టార్స్ ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, నాగార్జునతో పాటు సౌబీన్ షాహిర్, శృతిహాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నాగార్జున, సౌబీన్ షాహిర్ రోల్స్ నెగెటివ్ షేడ్స్‌లో సాగుతాయని సమాచారం. రజనీకాంత్, లోకేష్ కగనరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతుంది. కూలీ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


