Coolie Movie: ప్రస్తుతం పాన్ ఇండియన్ వైడ్‌గా మూవీ లవర్స్ రజనీకాంత్ కూలీ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో టాలీవుడ్ హీరో నాగార్జున విలన్‌గా నటిస్తున్నాడు. కన్నడ స్టార్ ఉపేంద్రతో పాటు సౌబీన్ షాహిర్, శృతిహాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. కోలీవుడ్‌లో ఫ్లాప్ లేని డైరెక్టర్‌గా కొనసాగుతోన్న లోకేష్ కగనరాజ్ కూలీ మూవీకి దర్శకత్వం వహించాడు.
150 కోట్లు…
సౌత్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి చేస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డేనే 150 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ వరల్డ్ వైడ్‌గా అరవై ఐదు కోట్ల మార్కును దాటాయి. కోలీవుడ్ హిస్టరీలోనే యాభై కోట్లకుపైగా ప్రీ సేల్స్ జరిగిన ఏకైక, తొలి సినిమాగా కూలీ నిలిచింది.
200 కోట్ల రెమ్యూనరేషన్…
కాగా కూలీ మూవీ కోసం రజనీకాంత్ తీసుకున్న రెమ్యూనరేషన్ కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం రజనీకాంత్ 200 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కూలీ మూవీతో ఓ సినిమా కోసం హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న ఇండియన్ హీరోల్లో ఒకరిగా రజనీకాంత్ రికార్డ్ క్రియేట్ చేసినట్లు టాక్.
Also Read – Career planning : ” ఏం చదవాలి? ఏమవ్వాలి? మీ అరచేతిలోనే కెరీర్ గైడ్.. అడిగితే చాలు చెప్పేస్తుంది!”
ఫస్ట్ టైమ్ విలన్…
కాగా ఈ మూవీలో సైమన్ అనే నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో నాగార్జున కనిపించబోతున్నాడు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ నాగార్జున విలన్‌గా నటిస్తున్న మూవీ ఇది. ఈ సినిమాలో రజనీకాంత్‌కు ధీటుగా పవర్‌ఫుల్‌గా నాగార్జున క్యారెక్టర్ ఉండబోతున్నట్లు ప్రమోషన్స్‌లో లోకేష్ కనగరాజ్ చెప్పాడు. విలన్ పాత్ర చేసినందుకు నాగార్జున ఇరవై నుంచి ఇరవై నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసినట్లు చెబుతోన్నారు.
స్పెషల్ సాంగ్‌లో…
కూలీ మూవీలో రజనీకాంత్ స్నేహితుడిగా కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం ఉపేంద్ర నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ కోలీవుడ్ మూవీలో నటించినందుకు శృతి హాసన్ నాలుగు కోట్లు, సౌబీన్ షాహిర్ కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలిసింది. స్పెషల్ సాంగ్‌లో మెరిసిన పూజాహెగ్డే భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుందట. మోనికా సాంగ్ కోసం మూడు కోట్లు ఛార్జ్ చేసినట్లు సమాచారం. కాగా రజనీకాంత్‌తో ఉన్న స్నేహం కారణంగా ఆమిర్‌ఖాన్ మాత్రం రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా ఈ మూవీలో నటించినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
రజనీకాంత్ తర్వాత…
కూలీ మూవీలో రజనీకాంత్ తర్వాత హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నది మాత్రం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కావడం విశేషం. ఈ సినిమా కోసం ఏకంగా యాభై కోట్లు రెమ్యూనరేషన్ స్వీకరించాడట లోకేష్ కనగరాజ్. కూలీ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read – Shocking: ప్రేమ – మోసం – త్యాగం… పసికందు కథలో నాటకీయ మలుపులు!


