Tuesday, June 17, 2025
Homeచిత్ర ప్రభRajinikanth: 'కన్నప్ప' మూవీ చూసిన రజినీకాంత్

Rajinikanth: ‘కన్నప్ప’ మూవీ చూసిన రజినీకాంత్

Rajinikanth Watched Kannappa Movie: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, పాట‌లు, పోస్ట‌ర్లు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ అప్పటిదాకా మూవీపై ఉన్న సందేహాలను పటాపంచలు చేసింది. మహాభారతం సీరియల్ తీసిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, అర్పిత రంకా, కౌశల్ మందా, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటీనటులు నటించడంతో మూవీపై మంచి హైప్ ఏర్పడింది.

ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ ఈ చిత్రం చూసి మెచ్చుకున్నట్లు విష్ణు తెలిపాడు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. గత రాత్రి రజినీకాంత్ అంకుల్ కన్నప్ప మూవీ చూశారని.. మూవీ చూసిన తర్వాత తనను గట్టిగా హగ్ చేసుకున్నారని చెప్పాడు. ఆయనకు మూవీ బాగా నచ్చిందని పేర్కొన్నాడు. ఈ క్షణం కోసం గత 22 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నానన్నాడు. ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నానని.. జూన్ 27 కోసం వెయిట్ చేయలేకపోతున్నానన్నాడు. వెండి తెరపై శివుడి మ్యాజిక్ ఫీల్ అయ్యేందుకు ఆసక్తిగా ఉందని రాసుకొచ్చాడు.

పరమశివుని గొప్ప భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. తన సొంత బ్యానర్ మీద విష్ణు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. మూవీలో ప్రభాస్ రుద్రుడిగా, అక్షయ్ కుమార్ పరమశివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీదేవి పాత్రలో నటించారు. అన్ని భాషలకు చెందిన నటులు మూవీలో నటించడంతో బాక్సాఫీస్ వద్ద తొలి రోజు మంచి వసూళ్లు రాబట్టాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ వేగవంతం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News