Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRaju weds Rambai: 'లిటిల్ హార్ట్స్' మ్యాజిక్ రిపీట్ అవుతుందా? 'రాజు వెడ్స్ రాంబాయి'కి!

Raju weds Rambai: ‘లిటిల్ హార్ట్స్’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ‘రాజు వెడ్స్ రాంబాయి’కి!

Raju weds Rambai: రీసెంట్ గా చిన్న సినిమాగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్టైన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా విజయం అందరికీ తెలిసిందే. మొదట్లో ఓటీటీ కోసం అనుకున్న ఈ సినిమాను, కంటెంట్ నమ్మి బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేటర్లకు తీసుకొచ్చారు. ఇప్పుడు అదే ఫార్ములాను ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీకి అప్లై చేస్తున్నారు.

- Advertisement -

‘నీది నాది ఒకే కథ’, ‘విరాట పర్వం’ ఫేమ్ దర్శకుడు వేణు ఊడుగుల ఈ సినిమాతో నిర్మాతగా మారాడు. రాహుల్ మోపిదేవి, ఈటీవీ విన్ సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు సాయిలు కంపాటి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/prabhas-spirit-korean-star-don-lee-entry-confirmed/

అఖిల్ ఉడ్డెమారి, తేజస్వినీ రావ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు… ‘లిటిల్ హార్ట్స్’తో హిట్ అందుకున్న వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సపోర్ట్ ఇస్తున్నారు. మళ్లీ అదే టీమ్ కలయికతో సినిమా వస్తుండటంతో, ఈ సినిమా కూడా ఆడియన్స్ లో మంచి ఏర్పడింది.

నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ, ఖమ్మం వరంగల్ మధ్య జరిగిన ఒక వాస్తవ విషాద ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిందని, ఇది ‘ప్రేమిస్తే’, ‘బేబీ’ తరహాలో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/rajinikanth-retirement-after-three-films/

సురేష్ బొబ్బిలి సంగీతం, మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందించిన ఈ ప్యూర్ లవ్ స్టోరీని… నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ‘లిటిల్ హార్ట్స్’ టీమ్ పవర్‌తో వస్తున్న ఈ రాజు వెడ్స్ రాంబాయి.. ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad