Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభRakhi Sawant: రాఖీ సావంత్ కు అంబానీ సాయం

Rakhi Sawant: రాఖీ సావంత్ కు అంబానీ సాయం

బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ కు అంబానీ సాయం చేస్తున్నట్టు ఆమె స్వయంగా వెల్లడించారు. ఈసందర్భంగా అంబానీ గొప్ప మనసుకు ఆమె ధన్యవాదాలు సైతం తెలియజేశారు. గత కొంతకాలంగా తన తల్లి క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారని.. ప్రస్తుతం ఆమె టాటా మెమోరియల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రాఖీ వెల్లడించారు. ప్రస్తుతం తన తల్లి ఎవరినీ గుర్తించే స్థితిలో కూడా లేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నట్టు రాఖీ తెలిపారు. గతంలో తన తల్లికి చికిత్స ఇప్పించేందుకు డబ్బులేదన్న రాఖీకి హీరో సల్మాన్ ఖాన్ ఆర్థిక సాయం చేశారు.

- Advertisement -

తన బాయ్ ఫ్రెండ్ అదిల్ ఖాన్ దురానీని సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్న రాఖీ ప్రస్తుతం హ్యాపీగా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా పెళ్లి తరువాత తన పేరును రాఖి సావంత్ ఫాతిమాగా ఆమె మార్చుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad