Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRakhi Sawant: హీరోయిన్‌గా అవ‌కాశాలు లేకే ఐటెంసాంగ్స్ చేస్తోంది - త‌మ‌న్నాపై రాఖీసావంత్ బోల్డ్ కామెంట్స్‌

Rakhi Sawant: హీరోయిన్‌గా అవ‌కాశాలు లేకే ఐటెంసాంగ్స్ చేస్తోంది – త‌మ‌న్నాపై రాఖీసావంత్ బోల్డ్ కామెంట్స్‌

Rakhi Sawant: సినిమాల కంటే వివాదాల‌తోనే బాలీవుడ్‌లో ఎక్కువ‌గా ఫేమ‌స్ అయ్యింది బోల్డ్ బ్యూటీ రాఖీ సావంత్‌. ఒక‌ప్పుడు హిందీలో ఐటెంసాంగ్స్ అంటే రాఖీ సావంత్ పేరు ఎక్కువ‌గా వినిపించేది. కొత్త హీరోయిన్ల జోరుతో పాటు టాప్ స్టార్స్ కూడా ఐటెంసాంగ్స్ చేయ‌డం మొద‌లుపెట్ట‌డంతో రాఖీ సావంత్‌కు అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఆరేళ్ల క్రితం రిలీజైన స‌బ్‌సే బ‌డా ఛాంపియ‌న్ అనే సినిమాలో చివ‌ర‌గా స్పెష‌ల్ సాంగ్ చేసింది రాఖీ సావంత్‌. యాక్ట‌ర్‌గా కూడా సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఈ బోల్డ్ బ్యూటీ క‌నిపించి రెండేళ్లు దాటిపోయింది. సినిమా ఆఫ‌ర్లు త‌గ్గ‌డంతో ఆదిల్ ఖాన్ దురానీని పెళ్లి చేసుకొని దుబాయ్‌లో సెటిల‌య్యింది. ఇటీవ‌లే ముంబైకి తిరిగి వ‌చ్చిన‌ ఈ బోల్డ్ బ్యూటీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

- Advertisement -

Also Read: Bihar Elections: ఓ వైపు ఎన్నికల ప్రచార జోరు.. మరోవైపు రూ. కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్‌ సీజ్‌

నేనే ఒరిజిన‌ల్‌…
హీరోయిన్లు ఐటెంసాంగ్స్‌లో క‌నిపించే క‌ల్చ‌ర్‌పై ఫైర్ అయ్యింది రాఖీ సావంత్‌. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాను టార్గెట్ చేస్తూ రాఖీ సావంత్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

బాలీవుడ్‌లో ఒరిజిన‌ల్ ఐటెంగ‌ర్ల్ తానేన‌ని రాఖీ సావంత్ చెప్పింది. త‌మ‌న్నాతో పాటు చాలా మంది హీరోయిన్లు త‌న అడుగు జాడ‌ల్లోనే న‌డుస్తున్నార‌ని చెప్పింది. “హీరోయిన్లుగానే ఇండ‌స్ట్రీలోకి వీరంతా అడుగుపెట్టారు. అశించిన స్థాయిలో వారి కెరీర్ సాగ‌లేదు. హీరోయిన్లుగా స‌క్సెస్ కాలేక‌పోవ‌డంతో ఐటెంసాంగ్స్ చేయ‌డం మొద‌లుపెట్టారు. మేము ఒరిజిన‌ల్ ఐటెంగ‌ర్ల్స్‌… వాళ్లు కాదు” అని రాఖీ సావంత్ కామెంట్ చేసింది. హీరోయిన్‌గా న‌టించ‌డానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని రాఖీ సావంత్ చెప్పింది. త‌మ‌న్నాను ఉద్దేశించి రాఖీ సావంత్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Also Read: Snake Video: ఫ్రిజ్‌ ఓపెన్ చేయగానే గుండెలు గుభేల్.. బుసలు కొడుతూ పడగ విప్పి లేచిన నాగుపాము..

రాఖీ సావంత్ కామెంట్స్‌పై మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్ని సినిమాలు చేసినా త‌మ‌న్నాకు రాఖీ సావంత్ సాటి రాద‌ని చెబుతోన్నారు. వైర‌ల్ కావ‌డానికి ఇలాంటి చీప్ కామెంట్స్ చేయ‌డం రాఖీ సావంత్‌కు అల‌వాటేన‌ని అంటున్నారు.

ఓ వైపు హీరోయిన్‌గా న‌టిస్తూనే అడ‌పాద‌డ‌పా ఐటెంసాంగ్స్ చేస్తోంది త‌మ‌న్నా. స్త్రీ 2, రైడ్ 2, గ‌ని, స‌రిలేరు నీకెవ్వ‌రు తో పాటు ప‌లు సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌లో త‌మ‌న్నా మెరిసింది. ఈ స్పెష‌ల్ సాంగ్స్ కోసం త‌మ‌న్నా భారీగానే రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్న‌ట్లు స‌మాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad