Wednesday, April 2, 2025
Homeచిత్ర ప్రభRakul Preet Singh: మోడీకి థ్యాంక్స్ చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: మోడీకి థ్యాంక్స్ చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్

ప్రధాని నరేంద్ర మోడీని అమితంగా అభిమానించే సెలబ్రిటీల్లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. డిసెంబర్ 26ని వీర బాల దివస్ గా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రకుల్ మోడీకి థ్యాంక్స్ చెబుతూ పెద్ద స్టోరీని పోస్ట్ చేశారు. సిక్కు మతగురువైన గురు గోవింద్ సింగ్ కుమారులు బాబా జొరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ వీర మరణం పొందిన ఈ రోజును కేంద్రం వీర బాల దివస్ గా ప్రకటించటంపై రకుల్ హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా సిక్కు అయిన రకుల్ కేంద్రం ప్రకటనతో ఫుల్ హ్యాపీ అయ్యారు. చిన్న పిల్లల్లో మంచి క్యారెక్టర్ బిల్డ్ చేసేలా ఇలాంటి చర్యలు దోహదం చేస్తాయని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఛత్రీవాలి సినిమా వర్క్ తో బిజీగా ఉన్న రకుల్ 2022లో ఏకంగా 5 సినిమాలతో సందడి చేశారు. కానీ ఇవేవీ హిట్ కాకపోగా టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు లేక బాలీవుడ్ లోనే ఆమె సెటిల్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రకుల్ పలు సామాజిక అంశాలపై చక్కగా స్పందిస్తూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News