Saturday, November 15, 2025
HomeTop StoriesRam Charan: 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘గ్లోబల్‌ స్టార్‌’.. 'పెద్ది' నుంచి సర్‌ప్రైజ్‌ పోస్టర్‌

Ram Charan: 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘గ్లోబల్‌ స్టార్‌’.. ‘పెద్ది’ నుంచి సర్‌ప్రైజ్‌ పోస్టర్‌

18 Years Of Ram Charan’s Glory: గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత’ సినిమాతో తెరంగేట్రం చేసిన రామ్‌ చరణ్‌.. రాజమౌళి ‘మగధీర’తో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ‘రంగస్థలం’, ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్లతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తం చేశాడు. ఈ సంద‌ర్భంగా అభిమానులు, సినీ వర్గాలు ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/manchu-manoj-reveals-behind-ntr-injury/

ప్ర‌స్తుతం రామ్‌చరణ్‌.. బుచ్చిబాబు సానాతో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి స్పోర్ట్స్‌ యాక్షన్‌ ఫస్ట్‌ గ్లింప్స్‌ను ఇటీవల విడుదల చేయగా మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్‌ చేసింది. ఈ క్రమంలో చెర్రీ.. టాలీవుడ్‌ జర్నీ 18 ఏళ్లు పూర్తయిన సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ చిత్ర బృందం ‘పెద్ది’ నుంచి కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్‌తో పాటు బిగ్‌ గిఫ్ట్‌ను ఇచ్చింది.

‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో రామ్ చ‌ర‌ణ్ రస్టిక్ లుక్‌లో గడ్డం, మాసిన జుట్టుతో చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాడు. రైలు పట్టాలపై మాస్‌ లుక్‌లో ముక్కుకు పోగుతో, బీడీ తాగుతూ చాలా ఇంటెన్స్ లుక్‌లో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. దీంతో ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad