Ram Charan – Nelson: ‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా ఇచ్చిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్.. టాలీవుడ్‌లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అనే వార్త సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఆ క్రేజీ కాంబినేషన్‌లో హీరో ఎవరో కాదు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్!
నెల్సన్, రామ్ చరణ్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం నెల్సన్ రజనీకాంత్‌తో ‘జైలర్ 2’ సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా పనులు పూర్తయిన వెంటనే ఆయన రామ్ చరణ్ సినిమా మొదలుపెట్టే అవకాశం ఉంది. అటు రామ్ చరణ్ కూడా బుచ్చి బాబు సనాతో చేస్తున్న ‘పెద్ది’ సినిమా పూర్తికాగానే నెల్సన్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read – Vidyabalan: జైలర్2లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ – రజనీ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ
ఈ సినిమాకు సంబంధించిన మరో అదిరిపోయే వార్త ఏంటంటే.. ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంగీతం అందించడానికి అనిరుధ్ రవిచందర్ పేరు దాదాపు ఖరారైందనే టాక్. నెల్సన్ సినిమాలకు అనిరుధ్ ఇచ్చే బీజీఎం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ‘డాక్టర్’, ‘బీస్ట్’, ముఖ్యంగా ‘జైలర్’తో రుజువైంది. రామ్ చరణ్ లాంటి మాస్ హీరో యాక్షన్, స్టైల్‌కు అనిరుధ్ మ్యూజిక్ తోడైతే, ఆ సినిమా వేరే లెవల్‌లో ఉంటుందని అభిమానులు ఇప్పటినుంచే ఫిక్స్ అయ్యిపోయారు.
ప్రస్తుతానికి ఇదంతా సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త మాత్రమే. కానీ, ఈ మూడు పవర్ ఫుల్ కాంబినేషన్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తే, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి పండగే.
Also Read – Ravi Teja: ‘బాహుబలి’ ఎఫెక్ట్ రవితేజ ‘మాస్ జాతర’ మళ్లీ వాయిదా!


