Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు రోజులు లెక్కబెట్టుకుంటూ ఎదురుచూసిన, ‘చికిరి చికిరి’ సాంగ్ ఎట్టకేలకు వచ్చేసింది! ప్రోమో విడుదలైనప్పటి నుంచే ఊపందుకున్న హైప్… సాంగ్ రిలీజ్ తర్వాత సునామీలా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే… పాట అదిరిపోయింది,
సాంగ్ లో రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి ఏం కావాలో అవన్నీ ఉన్నాయి. చరణ్ గ్రేస్, మాస్ స్టెప్పులు చూస్తుంటే ‘రంగస్థలం’ రోజులు గుర్తుకు వచ్చాయి. అలాగే జాన్నీ మాస్టర్ కొరియోగ్రఫీలో చరణ్ క్రికెట్ బ్యాట్ పట్టుకుని వేసిన ఆ స్టెప్స్ అయితే అస్సలు ఊహించని మాస్ మూమెంట్! ఈ స్టెప్పులు రాబోయే కొద్ది రోజుల్లో సోషల్ మీడియాను, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ఒక ఊపు ఊపడం ఖాయం. పాట విజువల్స్ కూడా చాలా రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, మోహిత్ చౌహాన్ గానం ఈ మాస్ నంబర్‌కి ఒక క్లాస్ టచ్ ఇచ్చాయి.
ఈ పాటలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ కెమిస్ట్రీ అయితే అద్భుతం. జాన్వీ అందాల ఆరబోత చూస్తుంటే నిజంగానే ఎవరైనా “చికిరి” అనాల్సిందే అన్నంత హాట్‌గా ఉంది. ‘ఉప్పెన’తోనే వంద కోట్ల మార్కును అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు సానా, తన రెండవ సినిమా ‘పెద్ది’తో బాక్సాఫీస్‌ను ఎంత గట్టిగా కొట్టబోతున్నాడో ఈ ఒక్క పాట చూస్తేనే అర్థమవుతోంది. మార్చి 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పాటతోనే ఇంత భారీ హైప్ క్రియేట్ అయితే, ఇక సినిమాలో ఇంకెన్ని సర్ప్రైజులు ఉన్నాయో అని ఆడియన్స్ ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌కి చేరింది!


