Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభPeddi: క్లాస్ లుక్ లోడింగ్‌...పెద్ది కోసం రామ్‌చ‌ర‌ణ్ స‌రికొత్త మేకోవ‌ర్‌ - రంగంలోకి దిగిన సెలిబ్రిటీ...

Peddi: క్లాస్ లుక్ లోడింగ్‌…పెద్ది కోసం రామ్‌చ‌ర‌ణ్ స‌రికొత్త మేకోవ‌ర్‌ – రంగంలోకి దిగిన సెలిబ్రిటీ స్టైలిష్ట్ – వీడియో వైర‌ల్

Peddi: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో పెద్ది ఒక‌టి. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఆరంభం నుంచే మెగా అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. రంగ‌స్థ‌లం త‌ర్వాత రా అండ్ ర‌స్టిక్ క‌థ‌తో రామ్‌చ‌ర‌ణ్ చేస్తున్న సినిమా ఇది.

- Advertisement -

మాస్ లుక్‌లో…
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ డ్రామాగా పెద్ది మూవీ తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్‌తో పాటు రామ్‌చ‌ర‌ణ్, శివ‌రాజ్‌కుమార్, దివ్యేందు శ‌ర్మ ఫ‌స్ట్‌లుక్‌ల‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.
ఈ మూవీలో పెద్దిగా కంప్లీట్ మాస్ లుక్‌లో గుబురు గ‌డ్డం, పొడ‌వైన హెయిర్ స్టైల్‌తో రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించారు. సినిమా కోసం చ‌ర‌ణ్ మేకోవ‌ర్ అయిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ మాస్ లుక్‌తో పాటు పెద్దిలో చ‌ర‌ణ్ క్లాస్ లుక్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read- Digital Education : సర్కారు బడుల్లో సాంకేతిక ‘కథా’చిత్రం.. యూట్యూబ్ పాఠాలతో భవిష్యత్ తరాలకు వెలుగు!

సెలిబ్రిటీ స్టైలిష్ట్‌…
ఈ క్లాస్ లుక్ కోసం సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హ‌కీమ్ రంగంలోకి దిగాడు. హైద‌రాబాద్‌లోని అలీమ్ హ‌కీమ్ స్టూడియోకు డైరెక్ట‌ర్ బుచ్చిబాబుతో క‌లిసి ఆదివారం రామ్‌చ‌ర‌ణ్ వ‌చ్చాడు. చ‌ర‌ణ్ కొత్త లుక్‌ను ఫైన‌ల్ చేసేశార‌ట‌.

ప‌వ‌ర్‌ఫుల్ లుక్ లోడింగ్‌…
రామ్‌చ‌ర‌ణ్ త‌న స్టూడియోకు వ‌చ్చిన వీడియోను అలీమ్ హ‌కీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పెద్ది కోసం చ‌ర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ లుక్ లోడింగ్ అంటూ ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు. గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, విజ‌న‌రీ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు ఓ రోజంతా సాగిన సుదీర్ఘ‌ చ‌ర్చ‌ల త‌ర్వాత పెద్ది లుక్‌ను ఫైన‌ల్ చేశామ‌ని అలీమ్ హ‌కీమ్ చెప్పాడు. ఈ కొత్త లుక్‌ను అభిమానుల‌కు చూపించేందుకు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న‌ట్లు చెప్పాడు. ఈ ఈ వీడియోలో అలీమ్ హ‌కీమ్‌తో రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ క‌నిపించారు. త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ను చ‌ర‌ణ్‌కు అలీమ్ హ‌కీమ్ ప‌రిచ‌యం చేసిన‌ట్లుగా క‌నిపిస్తుంది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

https://www.instagram.com/p/DNdmwgsNCA-/

జాన్వీక‌పూర్‌…
పెద్ది మూవీలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. దేవ‌ర త‌ర్వాత తెలుగులో జాన్వీ చేస్తున్న సెకండ్ మూవీ ఇది. శివ‌రాజ్‌కుమార్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 2026 మార్చి 27న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

Also Read- New Combinations: టాలీవుడ్‌లో కొత్త కాంబోస్ సెట్ – క్లాస్ డైరెక్ట‌ర్‌తో మాస్ మ‌హారాజా మూవీ – దేవ‌ర ద‌ర్శ‌కుడికి చైతూ గ్రీన్‌సిగ్న‌ల్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad