గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా అభిమానులకు చరణ్ బహిరంగ లేఖ విడుదల చేశారు.
“‘గేమ్ ఛేంజర్’ కోసం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తున్నందుకు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. సినిమా విజయంలో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. పాజిటివ్ రివ్యూలతో పాటు మాకు సపోర్ట్ ఇచ్చిన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. దర్శకుడు శంకర్‌కు బిగ్ థ్యాంక్స్. 2025 సంవత్సరానికి పాజిటివ్‌గా స్వాగతం చెప్పాం. ఇకపై కూడా మంచి నటనతో సినిమాలు ఇస్తానని అభిమానులకు ప్రామిస్ చేస్తున్నా. నా హృదయంలో ‘గేమ్ ఛేంజర్’కు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. మీ ప్రేమకు ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఏడాది కూడా మీ అందరికీ అద్భుతమైన సంవత్సరంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా” అంటూ లేఖలో రాసుకొచ్చారు.