Saturday, November 15, 2025
HomeTop StoriesPeddi : మెగా పవర్ స్టార్ 'పెద్ది' మ్యూజికల్ ట్రీట్ 'చికిరి చికిరి' వస్తోంది!

Peddi : మెగా పవర్ స్టార్ ‘పెద్ది’ మ్యూజికల్ ట్రీట్ ‘చికిరి చికిరి’ వస్తోంది!

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై రోజురోజుకు హైప్ పెరుగుతోంది. ఫస్ట్ షాట్ గ్లింప్స్ మొదలుకొని, మొన్నీ మధ్య విడుదలైన హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ వరకు… ప్రతిదీ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పెద్ది’ ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ కూడా వచ్చేసింది.

- Advertisement -

ALSO READ: RAM: మాకు ఈ ట్యాగ్స్ ఒద్దు, పాతవే ముద్దు అంటున్న చరణ్, రామ్!

ఇటీవల రామ్ చరణ్ ఒక ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో ఏ.ఆర్. రెహమాన్, బుచ్చిబాబు, మోహిత్ చౌహాన్‌ ఉన్నారు. దానికి చరణ్ “ఏం ప్లాన్ చేస్తున్నారు సార్?” అని కామెంట్ చేయగా, ఏ.ఆర్. రెహమాన్ దానికి రిప్లై ఇస్తూ “‘చికిరి చికిరి’ సార్!” అని పోస్ట్ చేశారు. దీనిని బట్టి, సినిమాలోని మొదటి పాట ‘చికిరి చికిరి’ పేరుతో విడుదల కాబోతుందని తెలుస్తోంది. ఈ పాటను నవంబర్ 8న జరగబోయే ఏ.ఆర్. రెహమాన్ కన్సర్ట్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ సాంగ్ కోసం మోహిత్ చౌహాన్‌ను తీసుకురావడం అంచనాలను మరింత పెంచేసింది. మోహిత్ చౌహాన్ గతంలో పాడిన పాటలు అన్నీ చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. ముఖ్యంగా, రణ్‌బీర్ కపూర్ ‘రాక్‌స్టార్’, అభిషేక్ బచ్చన్ ‘ఢిల్లీ 6’ లాంటి సినిమాల్లో తన పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సెంటిమెంట్‌తో, ‘పెద్ది’ మూవీలోని ఈ ‘చికిరి చికిరి’ కూడా ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

ALSO READ: Bandla Ganesh: వాట్సాప్ వాట్సాప్‌ అంటే హిట్టు రాదు.. వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉండాలి – విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై బండ్ల గ‌ణేష్ సెటైర్లు

ఈ మూవీ మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా క్యాస్టింగ్ చూస్తేనే ‘పెద్ది’ రేంజ్ ఏంటో అర్థమవుతుంది. కన్నడ నుంచి శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నుంచి హీరోయిన్‌గా జాన్వీ కపూర్, ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ, ఇలా పెద్ద క్యాస్టింగ్ నే ప్లాన్ చేసాడు బుచ్చిబాబు. మరి వీళ్లందరితో ‘పెద్ది’ లో పెద్దగా ఏం ప్లాన్ చేసాడో తెలుసుకోవాలి అంటే మార్చి వరకు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad