Peddi: పెద్ది అప్‌డేట్ కోసం రామ్‌చరణ్ ఫ్యాన్స్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. దసరాకు పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కనీసం పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. దీపావళికైనా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. పోస్ట్‌లు, ట్వీట్స్ పెడుతున్నారు. మరోసారి మెగా ఫ్యాన్స్‌కు నిరాశ తప్పేలా లేదని టాక్ వినిపిస్తోంది. దీపావళికి కూడా పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజ్ కావడం అనుమానమేనని ప్రచారం జరుగుతోంది.
రొమాంటిక్ డ్యూయెట్…
ఇటీవల పూణేలో రామ్‌చరణ్, జాన్వీకపూర్‌లపై ఓ రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్‌ను షూట్ చేశారు. ఈ పాట తాలూకు విజువల్స్ కొన్ని ఫస్ట్ సింగిల్‌కు ఎటాచ్ చేయాలనే అనుకుంటున్నారట. ఈ విజువల్స్‌లో రామ్‌చరణ్, జాన్వీ కపూర్ స్టెప్పులు హైలైట్‌గా ఉండనున్నాయని అంటున్నారు.
ఫుల్ ట్రీట్‌లా…
దీపావళికి ఐదు రోజులే టైమ్ ఉంది. మరోవైపు ఈ సాంగ్ షూటింగ్ మంగళవారం నాటితో ముగిసింది. తక్కువ గ్యాప్‌లో విజువల్స్‌తో సహా పాటను రెడీ చేయడమంటే అసాధ్యమే. అందుకే హడావిడిగా కాకుండా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్‌లా ఉండేలా మరికొంత టైమ్ తీసుకొని ఫస్ట్ సింగిల్‌ను రెడీ చేయాలనే ఆలోచనలో బుచ్చిబాబు అండ్ టీమ్ ఉన్నట్లు సమాచారం. ఫ్యాన్స్ డిసపాయింట్ కాకుండా దీపావళికి ఓ పోస్టర్‌ను విడుదల చేయాలనుకుంటున్నారట.
కన్నడ స్టార్ హీరో…
పెద్ది మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ అగ్ర నటుడు శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ పెద్ది మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌లో వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
షూటింగ్ కంప్లీట్ కాకముందే ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్‌తో పాటు మ్యూజిక్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. నాన్ థియేట్రికల్ బిజినెస్ 150 కోట్ల వరకు జరిగినట్లు చెబుతోన్నారు.
Also Read – Sudheer Babu: ‘జటాధర’ నుంచి ‘ట్రెండ్ సెట్ చేయ్ పిల్లాడా’ సాంగ్ రిలీజ్!


