గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ న్యూ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ ‘RC-16’గా ప్రకటించారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్వేంద్ వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ స్పోర్ట్స్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమవ్వగా, ఇటీవల శివరాజ్ కుమార్ కూడా సెట్స్‌లో జాయిన్ అయినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ‘RC-16’ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో ఓ పోస్టర్ తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే చిత్రబృందం అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికీ ఈ పోస్టర్ అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనా పెద్ది అన్న పేరు ట్రెండీగా ఉండని ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు సినిమాపై అంచనాలు రోజు రోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. మరి ఈ సినిమా పేరు ఏంటో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
