Ram Charan: తండ్రి మెగాస్టార్ చిరంజీవికి ఎమోషనల్‌గా బర్త్‌డే విషెస్ చెప్పారు గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్. శుక్రవారం చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు గోవాలో కుటుంబసభ్యుల సమక్షంలో జరిగాయి. చిరంజీవి పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు తాలూకు వీడియోను అభిమానులతో పంచుకున్నారు చరణ్. ఈ వీడియోలో కుటుంసభ్యులతో కలిసి చిరంజీవి కేక్ కట్ చేస్తూ కనిపించారు. తండ్రి పాదాలకు నమస్కరిస్తూ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు రామ్‌చరణ్. తనయుడిని ప్రేమకు చిరంజీవి సంతోషంగా పొంగిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నా గైడ్ మీరే…
తండ్రి చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ రామ్‌చరణ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. నా హీరో, నా గైడ్, నా ప్రేరణ మీరే, 70 ఏళ్ల వయసులో కూడా యువకుడిగా మా హృదయంలో నిలిచిపోయి మాకు ప్రేరణగా నిలుస్తున్నారు అని అన్నారు. అంతే కాకుండా జీవితంలో తాను సాధించిన విజయాలు, పాటిస్తున్న విలువలు అన్ని తండ్రి నుచ్చే వచ్చాయని ఈ పోస్ట్‌లో చరణ్ పేర్కొన్నారు. ఇది కేవలం మీ పుట్టినరోజు మాత్రమే కాదు.. మీలాంటి గొప్ప వ్యక్తికి జరుగుతున్న గొప్ప వేడుక. ఎవరైనా కోరుకునే ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఇలాగే మరిన్ని సంవత్సరాలు ఉండాలి నాన్న అంటూ చిరంజీవిని ఉద్దేశించి రామ్‌చరణ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మూడు సినిమాల అప్‌డేట్స్…
చిరంజీవికి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన మూడు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ రివీల్ చేశారు. విశ్వంభర గ్లింప్స్‌ను ఓ రోజు ముందుగానే గురువారమే రిలీజైంది. 2026 వేసవిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
టైటిల్ రివీల్…
అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదలచేశారు. ఈ సినిమాకు మన శంకరవరప్రసాద్‌గారు అనే టైటిల్ ఖరారైంది. సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక వాల్తేర్ వీరయ్య తర్వాత డైరెక్టర్ బాబీతో చిరంజీవి మరో సినిమా చేయబోతున్నాడు. శుక్రవారం (నేడు) సాయంత్రం ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌చేయబోతున్నారు.
Also Read – Parada : విభిన్న కథనంతో వచ్చిన అనుపమ హిట్టు అందుకుందా..లేదా..?


