Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభSukumar: రామ్ చరణ్‌తో చేసేది ఆ సినిమాకు సీక్వెలా..?

Sukumar: రామ్ చరణ్‌తో చేసేది ఆ సినిమాకు సీక్వెలా..?

Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే చరణ్ డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి లీకై ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ సాంగ్ సినిమాకి హైలెట్ అవుతుందంటున్నారు. ఇక, ఇప్పటికే, పెద్ది సినిమా నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ భారీ స్థాయిలో హైప్ ని పెంచాయి.

- Advertisement -

చరణ్ కెరీర్ లో పెద్ది సినిమా ఓ మాస్టర్ పీస్ లా మిగిలిపోతుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా అయిన మేకోవర్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. పెద్ది ఫస్ట్ షాట్ కి ఆయన ఇచ్చిన బీజీఎం ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. ఇక, ఒక్కో షాట్ ని ఎన్ని వందలసార్లు చూసి ఉంటారో ఫ్యాన్స్ లెక్కే లేదు.

Also Read- Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ఇద్ద‌రు క్రేజీ డైరెక్ట‌ర్స్‌ని రంగంలోకి దింపుతోన్న బ‌డా నిర్మాణ సంస్థ‌

ఇక, పెద్ది తర్వాత చరణ్ తన నెక్స్ట్ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, ఈ మూవీ ప్రకటన కూడా వచ్చేసింది. తాజాగా, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. వచ్చే ఏడాది మార్చ్ 27న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పెద్ది చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత కొన్నాళ్ళు రిలాక్స్ అయి సుకుమార్ సినిమాను మొదలుపెట్టనున్నారట.

అయితే, ఈ సినిమా కథ రంగస్థలం‌కి సీక్వెల్ అని టాక్ వినిపిస్తోంది. సుక్కూ-చరణ్ కాంబోలో వచ్చిన మాస్టర్ పీస్ రంగస్థలం. కల్ట్ క్లాసిక్‌గా వచ్చి చరణ్ కి మైల్ స్టోన్ మూవీలా నిలిచింది. అందుకే, ఈ కాంబోలో రంగస్థలం సినిమా సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు మొదలయ్యాయి. కానీ, దీనిపై ఇంకా దర్శకుడు సుకుమార్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. కానీ, నిజంగా సీక్వెల్ ని ప్లాన్ చేస్తే గ్యారెంటీగా మరో మైల్ స్టోన్ మూవీలా నిలవడం గ్యారెంటీ. పుష్ప ఫ్రాంఛైజీ ఎలాంటి సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పిందో అందరికీ తెలిసిందే. ఇది సుకుమార్ మాయాజాలం.

Also Read- Bigg Boss Updates: ఉతుక్కో.. ఆరబెట్టుకో.. నాకేం కర్మ.. కళ్యాణ్ కు ఇచ్చిపడేసిన అయేషా

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad