Saturday, May 24, 2025
Homeచిత్ర ప్రభసెన్సార్ బోర్డుపై రామ్ గోపాల్ వర్మ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సెన్సార్ బోర్డుపై రామ్ గోపాల్ వర్మ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా సెన్సార్ బోర్డుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన, సినిమాల్లో బూతులు, సెక్స్ సన్నివేశాలపై పడ్డ ఆంక్షల పట్ల తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. అందులో ఎటువంటి ఫిల్టర్ లేకుండా పోర్న్ కంటెంట్, హింసాత్మక వీడియోలు చూస్తున్నారు. అలాంటప్పుడు సినిమాలో చిన్న బూతు సన్నివేశం ఉంటేనే పెద్ద చర్చ ఎందుకు? ఒకవేళ ఫోన్‌లో చూడడం తప్పుకాదని భావిస్తే, అదే విషయాన్ని సినిమాల్లో చూపించడంలో తప్పేముంటుంది.. సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తీస్తున్నాం. వాటిలో ఉన్న విషయం పెద్దగా విస్తరించి చూపించకుండా నిబంధనల పేరుతో అడ్డుకోవడం సెన్సార్ బోర్డు చేసే పని కాదు అంటూ ఆర్జీవీ ఘాటుగా వ్యాఖ్యానించారు.

- Advertisement -

అంతటితో ఆగకుండా… సెన్సార్ బోర్డు అనేది ఎప్పుడో కాలం చెల్లిన వ్యవస్థ. ఇప్పటికీ ఆ స్టుపిడ్ ప్రాసెస్ కొనసాగుతుండడమే ఆశ్చర్యం. సినిమా ఒక క్రియేటివ్ ఫీల్డ్. ఎలాంటి పరిమితులు లేకుండా దర్శకుడి చూపు, భావనను ప్రేక్షకుల ముందు పెట్టడమే అసలైన స్వేచ్ఛ. కానీ ప్రస్తుతం ఆ స్వేచ్ఛపై బందీలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది అంటూ మరింతగా మండిపడ్డారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వర్మకు కొత్తేమీ కాదు. ముక్కుసూటిగా మాట్లాడే ఈ దర్శకుడు ఎన్నో సార్లు వివాదాలను ఎదుర్కొన్నాడు. కానీ ఈసారి ఆయన ఏకంగా సెన్సార్ బోర్డ్నే టార్గెట్ చేశారు. ఆయన విమర్శలపై సెన్సార్ బోర్డు ఏ విధంగా స్పందిస్తుంది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివాదాల మధ్య తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెలిబుచ్చడంలో ఆర్జీవీ ముందుంటారు. తన స్టయిలే వేరు అని మరోసారి నిరూపించిన వర్మ, సినిమాలు కేవలం బహిరంగ వేదికలపై బూతు చూపించడమే కాదని, అది సమాజాన్ని ప్రతిబింబించే ఒక మాధ్యమమని చెప్పే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News