Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRamgopal Varame: ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఆర్జీవీ..మండిపడుతున్న నెటిజన్లు!

Ramgopal Varame: ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఆర్జీవీ..మండిపడుతున్న నెటిజన్లు!

RGV-Teachers Day:భారతీయ సినీ రంగంలో ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదానికి కారణమయ్యారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామనే విషయం తెలిసిందే. ఆ సందర్భంగా సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు తమకు స్ఫూర్తినిచ్చిన గురువుల గురించి గుర్తుచేసుకుంటారు. అయితే వర్మ పెట్టిన పోస్ట్ మాత్రం ఒక్కసారిగా తీవ్ర చర్చకు దారితీసింది.

- Advertisement -

తాను దర్శకుడిగా మారడానికి…

శుక్రవారం ఉదయం ఆయన తన ఎక్స్ ఖాతాలో ఒక సందేశాన్ని షేర్ చేశారు. తాను దర్శకుడిగా మారడానికి, అలాగే తనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవడానికి సహకరించిన వారిని ఈ సందర్భంగా స్మరించుకుంటున్నట్లు తెలిపారు. అందులో అమితాబ్ బచ్చన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్, అయాన్ రాండ్, బ్రూస్ లీ, శ్రీదేవి వంటి ప్రముఖులను పేర్కొన్నారు. అయితే అదే జాబితాలో అంతర్జాతీయ నేరస్థుడు, ఉగ్రవాద కార్యకలాపాలతో అనేక దేశాలు వెతుకున్న దావూద్ ఇబ్రహీం పేరును కూడా చేర్చడం పెద్ద కలకలానికి కారణమైంది.

ఉగ్రవాది పేరును…

ఆ పోస్ట్ బయటకు వచ్చిన కొద్దిసేపటికే నెటిజన్లు మండిపడ్డారు. ఒక ఉగ్రవాది పేరును ఉపాధ్యాయ దినోత్సవం రోజున గురువుల జాబితాలో చేర్చడం ఎంతవరకు సరైనది అని ప్రశ్నిస్తున్నారు. పవిత్రమైన ఈ రోజు ఆచరణీయులైన వ్యక్తులను స్మరించుకోవడానికి అని చెప్పి, నేరజీవితాన్ని నడిపిన వ్యక్తిని ‘ప్రేరణగా’ పేర్కొనడం తప్పు అని సోషల్ మీడియాలో పలువురు స్పందించారు.

వర్మ వ్యాఖ్యలను చూసి కొందరు ఆశ్చర్యానికి గురవుతుంటే, మరికొందరు కోపంతో విరుచుకుపడ్డారు. ప్రత్యేకంగా దావూద్ పేరును లెజెండరీ నటులు, ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు, ఆలోచనాపరులతో సమానంగా ఉంచడమే అనేకమందిని ఆగ్రహానికి గురిచేసింది. వర్మ చేసిన పోస్ట్‌పై కామెంట్ల వర్షం కురుస్తోంది. అతనిపై తీవ్రమైన విమర్శలు, వ్యంగ్యాలు, ట్రోలింగ్ కొనసాగుతోంది.

Also Read: https://teluguprabha.net/international-news/tesla-offers-elon-musk-record-1-trillion-dollar-pay-package/

కొంతమంది నెటిజన్లు వర్మను నేరుగా ప్రశ్నిస్తూ, ఉపాధ్యాయ దినోత్సవం అసలు అర్థాన్ని అవమానపరిచారని ఆరోపించారు. “ఈ రోజు స్ఫూర్తినిచ్చిన వారిని గౌరవించాలి కానీ, సమాజానికి హానికరంగా మారిన వారిని ప్రస్తావించడం అనర్హం” అని ఒకరు రాశారు. ఇంకొకరు “సమాజంలో మీరు ఏం నేర్చుకుంటున్నారో మీ జాబితా చెబుతోంది” అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad