Ram Gopal Varma : తెలుగు సినీ పరిశ్రమలో సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో కలిసి సందడి చేశారు. ఈ షోలో ఆర్జీవీని “అందరికి ఆయన ఆర్జీవీ, నాకు మాత్రం సైతాన్” అని జగపతి బాబు సరదాగా పరిచయం చేయడం ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జగపతి బాబు, “ప్రేక్షకుల కోసం సినిమా తీస్తారా?” అని అడిగగా, ఆర్జీవీ నవ్వుతూ “నేను నేర్చుకున్నది ఏం చెప్పినా ఎవరూ వినరు” అని సమాధానం ఇచ్చారు.
ALSO READ: Devi sri Prasad: ఏంటి సార్ .. మీరు ఎన్నో హిట్స్ ఇచ్చినా.. పాత కార్లోనే..
సందీప్ రెడ్డి వంగాను ఆహ్వానిస్తూ జగపతి బాబు ఒక వోడ్కా బాటిల్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనిపై ఆర్జీవీ, “నాకు ఎందుకు ఇవ్వలేదు? సందీప్ పెద్ద దర్శకుడు కాబట్టి అని భావించారా?” అని రసవత్తరంగా వ్యాఖ్యానించారు. జగపతి బాబు స్పందించి, “మీ ఇద్దరిని చూస్తే ఒక డెవిల్, ఒక యానిమల్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్నట్లు ఉంది” అని నవ్వులు పంచారు. సందీప్, “మనం క్లాస్‌మేట్స్ అయితే ఎలా ఉంటుంది?” అడగగా, ఆర్జీవీ “అయితే మనలో ఒకరు అమ్మాయిగా పుట్టాలి” అని కౌంటర్ ఇచ్చి మరింత ఆసక్తిని రేకెత్తించారు.
ఈ షోలో ఆర్జీవీ, సందీప్‌ల మధ్య జరిగిన ఫన్నీ సంభాషణలు, జగపతి బాబు సరదాగా హోస్టింగ్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. ఈ ఎపిసోడ్ సెప్టెంబర్ 5న ZEE5లో, సెప్టెంబర్ 7న జీ తెలుగు ఛానల్‌లో ప్రసారం కానుంది. ఈ షో తెలుగు సినీ పరిశ్రమలోని రెండు ప్రముఖ దర్శకుల గురించి కొత్త కోణాలను ప్రేక్షకులకు అందిస్తుందని ఆశిస్తున్నారు.


