RGV: ఒకప్పుడు ‘సత్య’, ‘శివ’, ‘క్షణ క్షణం’ లాంటి సినిమాలతో తన మార్క్ చూపించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . కానీ, మధ్యలో ఆయన తీసిన ‘వ్యూహం’, ‘సిద్ధం’, ‘ఆఫీసర్’ లాంటి సినిమాలు జనాలను పెద్దగా మెప్పించలేకపోయాయి. అందుకే, ఆర్జీవీ మళ్లీ తన పాత ఫామ్‌లోకి రావాలని, మంచి సినిమా తీయాలని ప్రేక్షకులు గట్టిగా కోరుకుంటున్నారు. అలాంటి అంచనాలను పెంచుతూ, రీసెంట్‌గా ఆయన ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ అనే హారర్ కామెడీ సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులను చూస్తే, ఇది ఆర్జీవీకి ఒక మంచి కంబ్యాక్ ఫిల్మ్ అయ్యే అవకాశం ఉందనిపిస్తుంది.
ALSO READ: Chiranjeevi: ‘చిరంజీవి ధాబా’ వివాదం.. ఫ్యాన్స్‌కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్!
ఈ సినిమాకు ఉన్న అంచనాలకు ముఖ్య కారణం దీని కాస్టింగ్. సుమారు 30 ఏళ్ల తర్వాత, ఆర్జీవీ తన సూపర్ హిట్ సినిమా ‘సత్య’ లో విలన్ అయిన మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి పనిచేయబోతున్నాడు. మనోజ్ బాజ్‌పాయ్ ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అలాగే, జెనీలియా మనోజ్ బాజ్‌పాయ్ భార్య పాత్రలో నటిస్తుంది. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి. సినిమా పేరును బట్టి చూస్తే, ఒక పోలీస్ స్టేషన్‌లో దెయ్యం తిష్ట వేయడం, దాన్ని పోలీసులు ఎలా ఎదుర్కొన్నారు అనే స్టోరీ తో హారర్, కామెడీ కలగలిపి ఉండవచ్చు.
ALSO READ: Premante: ప్రియదర్శి ‘ప్రేమంటే’ టీజర్.. మళ్లీ ఒక మంచి హిట్ పడేలా ఉంది!
ఇక, రీసెంట్‌గా ఆర్జీవీ మరొక పెద్ద స్టార్ నటి ఫొటోను షేర్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ నటి మరెవరో కాదు, రమ్యకృష్ణ. ఆర్జీవీ షేర్ చేసిన ఆ ఫొటోలో రమ్యకృష్ణ చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించింది. చాలా బోల్డ్ అవతార్‌లో ఉంది. ఈ లుక్‌ను బట్టి, ఆమె సినిమాలో మాంత్రికురాలిగా నటిస్తుందని తెలుస్తోంది. అయితే, ఆమె దెయ్యం పాత్ర కాదని ఆర్జీవీ స్పష్టం చేశారు. ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 2026లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి, చాలా రోజులు తర్వాత ఆర్జీవీ సినిమాపై ఆడియన్స్ లో ఒక మంచి బజ్ కనిపిస్తోంది.


