Andhra King Taluka: రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్‌బాబు .పి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ అగ్ర నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు.
టీజర్ రిలీజ్…
ఆంధ్రా కింగ్ తాలూకా టీజర్‌ను ఆదివారం మేకర్స్ రిలీజ్ చేశారు. లవ్, రొమాంటిక్, యాక్షన్ అంశాలతో టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్టార్ హీరో అభిమానిగా రామ్ పోతినేని ఆటిట్యూడ్, డైలాగ్స్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి.
మన సమస్య అనుకోవడమే…
తండ్రీకొడుకుల అనుబంధంతో ఈ టీజర్ మొదలైంది. సినిమాలు చూసి ఎవరు చెడిపోతారే.. హాల్ ఎవడి తాలూకా అయినా ఇయాళ దీని మొగుడు మాత్రం ఈ ఆంధ్రా కింగ్ తాలూకే…. ఆళ్ల సమస్యను మన సమస్య అనుకోవడమే ప్రేమంటే… అంటూ టీజర్‌లోని డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
Also Read- Bigg Boss Elimination: ఈసారి డబుల్ స్ట్రోక్.. హౌస్ నుంచి ఇద్దరు లేడీస్ ఔట్..!
పీరియాడికల్ స్టైల్‌లో…
టీజర్‌లో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే లవ్‌స్టోరీ పీరియాడికల్ స్టైల్‌లో అందంగా ప్రజెంట్ చేశారు. బొమ్మ బ్లాక్‌బస్టర్ అక్కడ.. నైజాంలో కోసి గుంటూర్‌లో కారం ఎట్టి సీడెడ్‌లో ఫ్రై చేసి ఆంధ్రాలో పలావ్ వండేత్తే మొత్తం దిగిపోతుంది… అంటూ సినిమా పరిభాషలో రామ్ వేసిన మాస్ పంచ్‌లు టీజర్‌లో అదిరిపోయాయి. ఫ్యాన్ ఫ్యాన్ అని నువ్వు ఓ గుడ్డలు చింపేసుకోవడమే కానీ నువ్వొకడివి ఉన్నావని కూడా మీ హీరోకు తెలియదు అంటూ మురళీ శర్మ చెప్పిన డైలాగ్ ఆలోచనను కలిగిస్తోంది. థీమ్ మ్యూజిక్‌తో కూడిన బీజీఎమ్ బాగుంది.
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీలో స్టార్ హీరోగా ఉపేంద్ర కనిపించబోతుండగా.. అతడి అభిమానిగా రామ్ పోతినేని నటిస్తున్నాడు. ఓ అభిమాని జీవితంలో జరిగే సంఘటనలతో దర్శకుడు మహేష్ బాబు ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఆంధ్రా కింగ్ తాలూకా టైటిల్‌కు ఏ బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Also Read- Nithiin: ఫ్లాప్ హీరోతో లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ – లిమిటెడ్ బడ్జెట్‌లో ప్రయోగం
రిలీజ్ ఎప్పుడంటే…
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నవంబర్ 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నువ్వుంటే చాలే అనే పాటను రామ్ పోతినేని రాశారు. అనిరుధ్ ఆలపించారు. ఈ పాట యూట్యూబ్‌లో ఇరవై ఐదు మిలియన్లకుపైగా వ్యూస్‌ను దక్కించుకున్నది. పప్పీ షేమ్ అనే పాటను రామ్ పాడాడు. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీలో రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


