Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRam Pothineni: రామ్ క్రేజ్ పీక్స్ - ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ రికార్డులు...

Ram Pothineni: రామ్ క్రేజ్ పీక్స్ – ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ రికార్డులు బ్రేక్‌

Ram Pothineni: ఆశించిన స్థాయిలో స‌క్సెస్‌లు లేక‌పోయినా రామ్ పోతినేనికి టాలీవుడ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. రామ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్ప‌డానికి సింపుల్ ఫొటో ఎగ్జాంపుల్‌గా నిలిచింది. ఇటీవ‌ల త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో స్విమ్మింగ్ పూల్ ప‌క్క‌న కూర్చొని మ్యూజిక్ వింటూ వ‌ర్షాన్ని ఏంజాయ్ చేస్తున్న ఓ ఫొటోను పోస్ట్ చేశాడు రామ్‌. ఈ ఫొటోలో స్టైలిష్ లుక్‌లో రామ్ క‌నిపించాడు.

- Advertisement -

7.7 మిలియ‌న్ల లైక్స్‌…
రామ్ పోస్ట్ చేసినఫొటోకు ఏకంగా 7.7 మిలియ‌న్ల లైక్స్ వ‌చ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో హ‌య్యెస్ట్ లైక్స్ సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరో పోస్ట్‌గా రామ్ పోతినేని ఫొటో నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టాలీవుడ్ హీరో పోస్ట్‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఏడు మిలియ‌న్ల లైక్స్ రాలేదు. ఇన్ని రోజులు ఈ రికార్డు అల్లు అర్జున్ పేరిట ఉంది. అల్లు అర్జున్ పోస్ట్ చేసిన పుష్ప 2 ఫ‌స్ట్ లుక్‌కు 6.9 మిలియ‌న్ల లైక్స్ వ‌చ్చాయి. అల్లు అర్జున్ రికార్డును సింపుల్ ఫొటోతో రామ్ పోతినేని బ్రేక్ చేశాడు.

Also Read – Ram Setu : రామసేతుకు జాతీయ వారసత్వ హోదా.. సుప్రీంకోర్టు నోటీసులు

విజ‌య్ మాస్ లుక్‌…
హ‌య్యెస్ట్ లైక్స్ ప‌రంగా మూడో ప్లేస్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్నాడు. బీచ్‌లో మాస్ లుక్‌లో క‌నిపిస్తున్న ఓ ఫొటోను ఈ ఏడాది ఏప్రిల్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోకు 6.7 మిలియ‌న్ల లైక్స్ రావ‌డం గ‌మ‌నార్హం.

భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌…
కాగా ప్ర‌స్తుతం రామ్‌… ఆంధ్రా కింగ్ తాలూకా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి ఫేమ్ మ‌హేష్‌బాబు. పి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్‌కు జోడీగా భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌న్న‌డ హీరో ఉపేంద్ర ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఆంధ్రా కింగ్ సూర్యగా ఉపేంద్ర క‌నిపించ‌బోతుండ‌గా… అత‌డి డైహార్డ్ ఫ్యాన్స్‌గా రామ్ న‌టిస్తున్నాడు. ఓ స్టార్ హీరోకు, అత‌డి అభిమానికి మ‌ధ్య జ‌రిగే క‌థ‌తో ఈ మూవీ రూపొందుతున్న‌ట్లు స‌మాచారం. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా న‌వంబ‌ర్ 28న రిలీజ్ కాబోతుంది. వివేక్ – మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత హిట్టు లేదు…
మ‌రోవైపు రామ్ హిట్టు కొట్టి చాలా కాల‌మే అవుతోంది. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత రామ్ చేసిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. డ‌బుల్ ఇస్మార్ట్‌తో పాటు స్కంద‌, ది వారియ‌ర్‌, రెడ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాయి. ఆంధ్రా కింగ్ తాలూకా స‌క్సెస్ రామ్ కెరీర్‌కు కీల‌కంగా మారింది.

Also Read – War 2: అనుకున్న డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి వార్ 2.. ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో.. ఎప్పుడంటే?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad