Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRam Pothineni: కుల‌పిచ్చి కార‌ణంగా రోడ్డున ప‌డ్డాం - హీరో రామ్ పోతినేని కామెంట్స్‌

Ram Pothineni: కుల‌పిచ్చి కార‌ణంగా రోడ్డున ప‌డ్డాం – హీరో రామ్ పోతినేని కామెంట్స్‌

Ram Pothineni: స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా టాలీవుడ్ స్టార్ హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు రామ్ పోతినేని. సోష‌ల్ మీడియాలో రామ్‌కు ఫాలోయింగ్ ఎక్కువే. రామ్ హిట్టు అందుకొని ఆరేళ్లు దాటిపోయింది. అయినా హీరోగా అత‌డి క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. జ‌గ‌ప‌తిబాబు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా టాక్ షోకు ఇటీవ‌ల రామ్ పోతినేని గెస్ట్‌గా వ‌చ్చాడు. ఈ టాక్ షోలో త‌న కెరీర్‌తో పాటు వ్య‌క్తిగ‌త జీవితంపై రామ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

- Advertisement -

కుల‌పిచ్చి వ‌ల్ల‌….
కుల‌పిచ్చి కార‌ణంగా త‌మ కుటుంబం విజ‌య‌వాడను వ‌దిలిపెట్టి చెన్నైలో సెటిల‌వ్వాల్సివ‌చ్చింద‌ని రామ్‌ అన్నాడు. “నేను పుట్టిన టైమ్‌లోనే విజ‌య‌వాడ‌లో కులాల పేరుతో అల్ల‌ర్లు ఎక్కువ‌ైపోయాయి. గొడ‌వ‌ల‌ కార‌ణంగా మా ఆస్తుల‌న్నీ కోల్పోయి రాత్రికి రాత్రే రోడ్డున ప‌డ్డాం. దాంతో ఫ్యామిలీ మొత్తం విజ‌య‌వాడ నుంచి చెన్నైకి వెళ్లిపోయాం. మ‌ళ్లీ జీరో నుంచి లైఫ్‌ను మొద‌లుపెట్టాల్సివ‌చ్చింది” అని రామ్ చెప్ప‌ాడు.
ఈ టాక్ షోలో రామ్ ల‌వ్ స్టోరీ గురించి జ‌గ‌ప‌తిబాబు అడిగారు. సోలోగా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నావంటే ఏదో ఎఫైర్‌ ఉండే ఉంటుంది అని జ‌గ‌ప‌తిబాబు అన‌గా… ల‌వ్ అనండి ఒకే… ఎఫైర్ ఏంటి అని రామ్‌ బ‌దులిచ్చాడు. ఇప్ప‌టివ‌ర‌కు చాలా మంది అమ్మాయిల‌ను నా వెంట తిప్పుకున్నాను… కానీ వారిలో ఒక్క అమ్మాయిని ప‌డేయ‌టానికి మాత్రం చాలా క‌ష్ట‌ప‌డాల్సివ‌చ్చింద‌ని రామ్ అన్నాడు. ఈ షోలో ల‌వ్ గురించి జ‌గ‌ప‌తిబాబు అడిగిన ప్ర‌తి ప్ర‌శ్న‌కు రామ్ సిగ్గుప‌డుతూ స‌మాధానాలు దాట‌వేయ‌డంతో అత‌డు ప్రేమ‌లో ప‌డ్డ‌ది నిజ‌మేన‌ని అంటున్నారు.

Also Read – BC Bandh: రాష్ట్రంలో కొనసాగుతున్న బంద్‌.. డీజీపీ కీలక ఆదేశాలు!

ఆంధ్రా కింగ్ తాలూకాలో…
హీరోయిన్ భాగ్య‌శ్రీ బోర్సేతో రామ్ ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి ఫేమ్ మ‌హేష్ బాబు పి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. క‌న్నడ అగ్ర న‌టుడు ఉపేంద్ర కీల‌క పాత్ర పోషిస్తున్నారు.
ఆంధ్రా కింగ్ తాలూకా న‌వంబ‌ర్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో హీరోగా న‌టిస్తూనే ఇందులో ఓ పాట రాశాడు రామ్‌. మ‌రో సాంగ్‌ను పాడాడు. ఆంధ్రా కింగ్ తాలుకా త‌ర్వాత బాహుబ‌లి నిర్మాత‌ల‌తో రామ్ ఓ హార‌ర్ మూవీ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read – Priyadarshi: నోరు జారితే అంతే! ప్రియదర్శి ‘మిత్రమండలి’ స్టేట్‌మెంట్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad