Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్స్‌తో సినిమాల ఎంపికలో తన స్టైల్ మార్చేశారు రామ్. సీనియర్ డైరెక్టర్స్‌ను దూరం పెడుతూ కొత్త దర్శకులకు వరుసగా అవకాశాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకాతో బిజీగా ఉన్నాడు రామ్. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్‌బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఆంధ్రా కింగ్ తాలూకా సెట్స్‌పై ఉండగానే రామ్ మరో మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కిషోర్ గోపు అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం. డిఫరెంట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ఉండబోతున్నట్లు చెబుతోన్నారు. తొలుత ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అనివార్య కారణాల వల్ల నాగచైతన్య సినిమా నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో రామ్ పోతినేని ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చినట్లు సమాచారం. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సింగిల్ సిట్టింగ్‌లోనే రామ్ ఈ సినిమాకు ఓకే చెప్పాడట.
Also Read – Kitchen Tips:అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా…అయితే జాగ్రత్త!
జనవరిలో షూటింగ్ మొదలు…
జనవరి నుంచి రామ్, ఆర్కా మీడియా మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు సమాచారం. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభుయార్లగడ్డ ఈ సినిమాను నిర్మించబోతున్నారట. డిసెంబర్‌లో రామ్ కొత్త సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని అంటున్నారు. అదే నెలలో లాంఛింగ్ ఈవెంట్‌ను నిర్వహిస్తారని సమాచారం.
భాగ్యశ్రీ బోర్సే…
కాగా రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ నవంబర్ 28న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ అగ్ర హీరో ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓ స్టార్ హీరోకు… అతడి అభిమానికి మధ్య జరిగే కథతో ఈ మూవీ రూపొందుతున్నట్లు సమాచారం. ఆంధ్రా కింగ్ సూర్య కుమార్ అనే స్టార్‌గా ఉపేంద్ర కనిపించబోతుండగా… అతడి డైహార్డ్ ఫ్యాన్ సాగర్‌గా రామ్ పాత్ర ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందని మేకర్స్ చెబుతోన్నారు.
నెట్‌ఫ్లిక్స్…
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. వివేక్ – మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రిలీజ్ ముందే ఆంధ్రా కింగ్ తాలూకా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రికార్డ్ ధరకు సొంతం చేసుకున్నది.
కాగా ఆంధ్రా కింగ్ తాలూకాకు ముందు రామ్ చేసిన డబుల్ ఇస్మార్ట్‌తో పాటు స్కంద, వారియర్, రెడ్ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో రామ్ కెరీర్‌కు ఆంధ్రా కింగ్ తాలూకా సక్సెస్ కీలకంగా మారింది.
Also Read – Nellore Lady Don : నెల్లూరు ‘లేడీ డాన్’ అరుణ.. గన్‌తో బెదిరింపులు.. మెడకు బిగుస్తున్న ఉచ్చు!


