Sunday, February 23, 2025
Homeచిత్ర ప్రభMovie Review: 'రామం రాఘవం’ మూవీ రివ్యూ

Movie Review: ‘రామం రాఘవం’ మూవీ రివ్యూ

ధన్రాజ్ కు డైరెక్టర్ గా డెబ్యూ

దశరథుడి మాటని శిరసావహించి శ్రీరాముడు అడవులకు వెళ్లాడు, అది రామయణం. రాఘవ మాటను శిరసావహించి రామం ఇంకెంత దూరం వెళ్లాడు అనేదే ‘రామం రాఘవం’ సినిమా.

- Advertisement -

ఈ సినిమా చూసి ధనరాజ్ డైరెక్షన్ బాగా చేశాడని జనం చెప్పినప్పుడే వచ్చి ఫ్రంట్ సీటులో కూర్చుంటా, అప్పటి వరకూ నిలబడే ఉంటానని అన్నారు ధనరాజ్. అయితే ధనరాజ్కి ఇక నిలబడాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ సీటులో దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చునే టైం రానే వచ్చింది. దశరథుడి మాటని శిరసావహించి శ్రీరాముడు అడవులకు వెళ్లాడు, అది రామయణం. రాఘవ మాటను శిరసావహించి రామం ఇంకెంత దూరం వెళ్లాడు అనేదే ‘రామం రాఘవం’ సినిమా. రాముడి లాంటి తండ్రికి పుట్టిన రాక్షసుడి కథే ‘రామం రాఘవం’.
కడుపు తీపితో, తమ బిడ్డల పట్ల కటువుగా వ్యవరించే తల్లితండ్రుల పట్ల ఏదో ఒక సందర్భంలో క్షణ మాత్రంగానైనా ద్వేషం పెంచుకుంటారు పిల్లలు. అయితే అది “తమ మంచి కోసమే కదా” అని అంతలోనే అర్ధం చేసుకుంటారు. కానీ అలా తండ్రి మనసు అర్ధం చేసుకోకుండా, తండ్రినే చంపేసి, తను కోరి తెచ్చుకున్న కష్టాల నుంచి గట్టెక్కాలనుకునే ఓ కిరాతక తనయుడి కథే “రామం – రాఘవం“.

సముద్రఖని తండ్రిగా
స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మించిన ఈ చిత్రంతో ప్రముఖ నటుడు ధనరాజ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నటుడిగా మారిన ప్రముఖ తమిళ దర్శకుడు సముద్రఖని తండ్రి పాత్ర పోషించిన ఈ చిత్రంలో ధనరాజ్ తనయుడిగా నటించగా… ప్రమోదిని, హరీష్ ఉత్తమన్, సత్య, సునీల్, పృథ్వి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

దర్శకుడిగా ఫస్ట్ సినిమా అంటే
స్వతహాగా మంచి దర్శకుడైన సముద్రఖని నటుడిగానూ విశేషంగా రాణిస్తుండడం మనం చూస్తున్నాం. అయితే, “రామం – రాఘవం” చిత్రంలో కొడుకును ప్రయోజకుడిగా తీర్చిదిద్ధడంలో విఫలమైనందుకు తనలో తనే మదనపడుతూ, ఏ తండ్రీ చేయని త్యాగం చేసి తండ్రిగా అతను చూపిన అభినయం, నటుడిగా అతన్ని మరో మెట్టు ఎక్కిస్తుంది. అలాగే, పాత్రోచితంగా నటీనటులను ఎంపిక చేసుకోవడం, వారి నుంచి అవసరమైన మేరకు నటన రాబట్టుకోవడంతోపాటు, సాంకేతిక నిపుణుల నుంచి కూడా మంచి ఔట్ ఫుట్ తీసుకోవడంలో ధనరాజ్ మంచి మార్కులు స్కోర్ చేశాడు. ప్రత్యేకంగా గుర్తు చేస్తే తప్ప, దర్శకుడిగా ఇది అతని మొదటి చిత్రం అంటే నమ్మబుద్ధి కాదు. అంత పెర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశాడు. అయితే కథనం రక్తి కట్టడం కోసం, మరి కొంచెం నాటకీయత చొప్పించడం, చంపేయాలన్నంతగా తండ్రి పట్ల కొడుకు ద్వేషం పెంచుకోవడానికి గల కారణం ఎస్టాబ్లిష్ చేయడంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
తండ్రీ కొడుకుల అనుబంధంపై టాలీవుడ్లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ‘రామం రాఘవం’ కూడా ఈ కోవలోకే చెందిన సినిమా. కొడుకు అంటే ప్రాణంగా చూసుకునే తండ్రికి అతడి ప్రవర్తన వల్ల ఎదురయ్యే కష్టాలను మనకు ఈ సినిమాలో చక్కగా చూపెట్టారు. తండ్రి పాత్రలో సముద్రఖని చాలా బాగా నటించారు. ఆయనకు ఇలాంటి పాత్రలు ఎంతలా సూట్ అవుతాయనేది ఆయన మరోసారి ప్రూవ్ చేశారు. అటు కొడుకు పాత్రలో ధన్రాజ్ కూడా ఆకట్టుకున్నాడు.

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కథలోకి వెళ్లేందుకు ప్రేక్షకులకు చాలా సమయం పడుతుంది. ఒక రొటీన్ ప్లాట్లా అనిపించే ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టిస్తుంది. అన్ని చిత్రాల్లో మాదిరిగా ఇందులోనూ తండ్రి కోరికను తీర్చలేని కొడుకు కథతో తొలుత ప్రేక్షకులకు కొంతమేర చిరాకు తెప్పిస్తారని చెప్పాలి.

సాంకేతిక వర్గం :
ధన్రాజ్ ఈ సినిమాతో డైరెక్టర్గా మెప్పించాడు అని చెప్పాలి. తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ఇతర సినిమాలలా కాకుండా కాస్త డిఫరెంట్గా చూపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో దుర్గాప్రసాద్ కొల్లి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ప్రతి సీన్ కూడా రియలిస్టిక్గా కనిపిస్తుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా. అరుణ్ చిలువేరు అందించిన బీజీఎం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్; 3/5

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News