Ranbir Kapoor – Yash : బాలీవుడ్‌లో ఇప్పుడు ఒకటే టాపిక్! ఏంటి అనుకుంటున్నారా? రాబోయే విజువల్ గ్రాండియర్ రామాయణం గురించే! సినిమా విడుదలకి ఇంకా ఏడాది పైనే టైం ఉన్నా, ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించడమే కాదు.. ఏకంగా ఒక సంస్థ మార్కెట్ షేర్‌ను ఆకాశానికి లేపింది. అసలు విషయమేమంటే.. రామాయణ సినిమాను నిర్మిస్తోన్న ప్రైమ్ ఫోకస్ సంస్థ షేర్ ధర జూన్ 25న కేవలం రూ.113.47 పైసలు ఉండేది. అయితే, టీజర్ రిలీజ్ అయిన తర్వాత జూలై 1 నాటికి అది రూ. 149.69కి చేరింది, ప్రస్తుతం ఏకంగా రూ. 169కి చేరుకోవడం నిజంగా అనూహ్యం!
ప్రైమ్ ఫోకస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4638 కోట్ల నుంచి రూ. 5641 కోట్లకు దూసుకుపోయింది. ఇది ఏకంగా రూ. 1000 కోట్ల పెరుగుదల! ట్రేడ్ పండితులు దీన్ని ‘రామాయణ ప్రభావం’ గానే విశ్లేషిస్తున్నారు. ఇంత భారీ పెరుగుదల గతంలో ఎప్పుడూ జరగలేదట, ఇది మామూలుగా విషయం కాదని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఈ భారీ బజ్ వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. రెండు భాగాలుగా వస్తున్న ఈ విజువల్ గ్రాండియర్ మీద ఆడియన్స్‌లో పెరుగుతున్న నమ్మకం, అలాగే భారీ కాస్టింగ్ – రణబీర్ కపూర్, యష్, సాయిపల్లవి వీళ్ల పేర్లు అంచనాలను దంచి కొడుతున్నాయి. దర్శకుడు నితేశ్ తివారికి రాజమౌళి అంత బ్రాండ్ లేకపోయినా, బజ్ విషయంలో ఆయనకు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌లో ప్యాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. ఇది నిజంగా ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి.
Also Read – Chandra Babu: టీచర్ అవతారమెత్తిన సీఎం చంద్రబాబు..స్టూడెంట్స్‌కి స్పెషల్ క్లాస్
మూవీ రిలీజ్‌కు ముందే బజ్ ఇలా ఉంటే.. వచ్చే ఏడాది రామాయణ సినిమా రిలీజ్ అయ్యే నాటికి ఇంకే స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టమే! ట్రైలర్, ప్రమోషనల్ మెటీరియల్ బయటికి వస్తున్న కొద్దీ షేర్ వాల్యూ మరింత పెరగడం ఖాయం, ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒక సినిమా నిర్మాణం ఒక సంస్థ షేర్ మార్కెట్ మీద ఇంతలా సానుకూలంగా ప్రభావం చూపించడం చాలా అరుదుగా జరిగే విషయం. ఈ రెండు భాగాలు ఏడాది గ్యాప్‌లో, 2026, 2027 దీపావళి పండగకు రిలీజ్ కాబోతున్నాయి. దీనికి పోటీ ఇచ్చే సాహసం ఎవరూ చేయకపోవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సాంకేతికంగా హాలీవుడ్ సినిమాలతో పోటీ పడేలా రామాయణ సినిమాను 86 కెమెరాల సెటప్ ని ఉపయోగిస్తున్నారు, ఇంటర్ స్టెల్లార్ కోసం ఉపయోగించిన VFX యంత్రాలు ఈ మూవీ కోసం పని చేస్తున్నాయని సమాచారం. ఇది నిజంగా ఆసక్తిని రేకెత్తించే విషయం. క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ఇంటర్ స్టెల్లార్ ఒక వెండితెరపై విజువల్ వండర్‌గా అప్రిషియేషన్స్ పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కెమెరా పనితనం గురించి ప్రశంసలు కురిసాయి. అందుకే ఇప్పుడు నితీష్ తివారీ అలాంటి 86 కెమెరాల సెటప్ తో ఎలాంటి ప్రయోగం చేస్తున్నాడో చూడాలనే ఉత్కంఠను పెంచింది. ఆదిపురుష్‌తో రాముడి కథని సరిగా తీయలేదని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బాలీవుడ్‌కు ఇప్పుడు ఆశలన్నీ రామాయణం మీదే ఉన్నాయి. ఈ సినిమా విజువల్ వండర్‌గా నిలిస్తే మాత్రం బాలీవుడ్ గేమ్‌కు గేమ్ ఛేంజర్ అవుతుందనడంలో సందేహం లేదు.
Also Read – EPFO Interest Credit: ఇపిఎఫ్ఒ ఖాతాల్లో రూ.4,000 కోట్ల వడ్డీ జమ


