Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభRana Naidu 2: 'రానా నాయుడు 2' ట్రైలర్ విడుదల.. ఈసారి అంతకుమించి..

Rana Naidu 2: ‘రానా నాయుడు 2’ ట్రైలర్ విడుదల.. ఈసారి అంతకుమించి..

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh), రానా దగ్గుబాటి(Rana Daggubati) కలిసి నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’(Rana Naidu). ఈ సిరీస్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో వెంకీ, రానా తండ్రీకొడుకులుగా నటించారు. అయితే మూవీలోని పలు సీన్స్ మరీ బోల్డ్‌గా ఉన్నాయంటూ దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంది. అయినా కానీ నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపింది.

- Advertisement -

దీనికి కొనసాగింపుగా ‘రానా నాయుడు సీజన్-2′(Rana Naidu 2) రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సీజన్‌2 ట్రైలర్‌ను విడుదల చేశారు. తొలి సీజన్‌కు మించి వినోదం, థ్రిల్‌ను పంచడానికి సిద్ధమైనట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. కరణ్ అన్షుమన్(Karan Anshuman) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌లో విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad