Wednesday, May 21, 2025
Homeచిత్ర ప్రభRana Naidu 2: రానా నాయుడు 2 టీజర్ వచ్చేసింది.. మామూలుగా లేదుగా..!

Rana Naidu 2: రానా నాయుడు 2 టీజర్ వచ్చేసింది.. మామూలుగా లేదుగా..!

టాలీవుడ్‌లో సెన్సేషనల్ కాంబినేషన్‌గా నిలిచిన దగ్గుబాటి వెంకటేశ్, రానా కలిసి నటించిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌ ‘రానా నాయుడు’ మరోసారి దుమ్ము రేపేందుకు రెడీ అవుతోంది. తొలి సీజన్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఇప్పుడు రెండో సీజన్‌ను జూన్ 13న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -

మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తండ్రి – కొడుకుల మధ్య నడిచే మానసిక పోరు, ప్రతీకారం, కుట్రలు, విరోధాలు ఇలా ఎన్నో మలుపులతో రానా నాయుడు కథ నడుస్తుంది. ఇందులో వెంకటేశ్ ‘నాగ నాయుడు’గా ఒక మాఫియా డాన్ పాత్రలో గంభీరంగా కనిపించగా, రానా ‘రానా నాయుడు’గా క్లీనప్ స్పెషలిస్టుగా కనిపించి ఆకట్టుకున్నారు.

మొదటి సీజన్‌లో కనిపించిన ఇంటెన్స్ డ్రామాను కొనసాగిస్తూ, ఈ సీజన్‌ మరింత వేగంగా, రఫ్‌గా ఉండబోతుందని టీజర్‌ ఇప్పటికే హింట్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ సారి బాలీవుడ్‌ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా ఎంటర్ అవుతుండటంతో ఉత్కంఠ ఇంకాస్త పెరిగింది. టీజర్‌లో ఆయన లుక్‌ ఇప్పటికే దృష్టి ఆకర్షిస్తోంది. అలాగే కృతికర్భందా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

‘బ్రీథ్’, ‘ఇన్సైడ్ ఎడ్జ్’ వంటి హిట్ సిరీస్‌లకు దర్శకత్వం వహించిన కరణ్ అన్షుమాన్ ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. టెక్నికల్‌గా హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దినట్లు టీజర్‌లోనే కనిపిస్తోంది. కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్ని ఇంటర్నేషనల్ టచ్‌తో ఉండటం విశేషం. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ సిరీస్ జూన్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. వెంకటేశ్ – రానా మళ్లీ స్క్రీన్‌పై చూపించబోయే ఇంటెన్స్ డ్రామా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News