Tuesday, May 20, 2025
Homeచిత్ర ప్రభRana Naidu 2: ‘రానా నాయుడు 2' ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Rana Naidu 2: ‘రానా నాయుడు 2′ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh), రానా దగ్గుబాటి(Rana Daggubati) కలిసి నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’(Rana Naidu). ఈ సిరీస్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్‌లో వెంకీ, రానా తండ్రీకొడుకులుగా నటించారు. అయితే మూవీలోని పలు సీన్స్ మరీ బోల్డ్‌గా ఉన్నాయంటూ దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంది. అయినా కానీ నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపింది.

- Advertisement -

దీనికి కొనసాగింపుగా ‘రానా నాయుడు సీజన్-2′(Rana Naidu 2) రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు. జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టు అధికారికంగా వెల్లడించారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. కరణ్ అన్షుమన్(Karan Anshuman) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌లో విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్(Arjun Rampal) నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News