Ranveer Singh: రణవీర్ సింగ్ ధురంధర్ షూటింగ్ సెట్స్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం వల్ల 120 మంది యూనిట్ సభ్యులు హాస్పిటల్ పాలయ్యారు. ఈ ప్రమాదం కారణంగా ధురంధర్ షూటింగ్ ఆగిపోయినట్లు సమాచారం. ఈ బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ జమ్ముకశ్మీర్‌లోని లేహ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో రణవీర్‌సింగ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ప్రాణాలకు ప్రమాదం లేదు…
ఆదివారం రోజు ధురంధర్ సినిమా సెట్స్‌లో ఫుడ్ పాయిజన్ జరిగిందట. సెట్స్‌లో డిన్నర్ చేసిన 120 మందికిపైగా యూనిట్ సభ్యులు కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పితో బాధపడినట్లు తెలిసింది. వారిని మేకర్స్.. లేహ్‌లోని సజల్ నర్భు మెమోరియల్ హాస్పిటల్‌కు తరలించారట. కలుషిత ఆహారం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. యూనిట్ సభ్యులంతా క్షేమంగా ఉన్నారని, ఎవరి ప్రాణాలకు ప్రమాదమేమి లేదని సినిమా వర్గాలు ప్రకటించాయి. ఫుడ్ పాయిజన్‌తో ధురంధర్ షూటింగ్‌ను అర్ధాంతరంగా మేకర్స్ నిలిపివేసినట్లు సమాచారం. ఈ ఫుడ్‌పాయిజన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను కొనసాగిస్తున్నట్లు చెబుతోన్నారు.
Also Read- Discount: రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5G పై కళ్ళు చెదిరే ఆఫర్..లాంచ్ ధర కంటే రూ.8000 తక్కువ!
నేషనల్ అవార్డ్ విన్నర్…
ధురంధర్ మూవీకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఆధిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ధురంధర్ మూవీలో సంజయ్‌దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ బాలీవుడ్ మూవీలో రణవీర్‌సింగ్‌కు జోడీగా సారా అర్జున్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో పలు సినిమాల్లో చైల్డ్ యాక్టర్‌గా కనిపించిన సారా అర్జున్.. ధురంధర్‌తో హీరోయిన్‌గా మారింది.
డిసెంబర్ 5న రిలీజ్…
ఇటీవల ధురంధర్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పొడవైన గడ్డం, హెయిర్ స్టైల్‌తో డిఫరెంట్ లుక్‌లో రణవీర్‌సింగ్ కనిపించారు. ఇందులో కోవర్ట్ ఆఫీసర్‌గా రణవీర్‌సింగ్ నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆధిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.


