Wednesday, October 30, 2024
Homeచిత్ర ప్రభRashmika Bollywood dreams: బిగ్ హీరో సినిమా ఛాన్స్ కొట్టిన రష్మిక

Rashmika Bollywood dreams: బిగ్ హీరో సినిమా ఛాన్స్ కొట్టిన రష్మిక

హిందీ సినిమా మోజులో మునిగి తేలుతున్న బ్యూటీ

రష్మిక మందన్న టాలీవుడ్ లో మంచి స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు.  కానీ మిగతా హీరోయిన్స్ లాగే గత కొన్నేళ్లుగా ఈమెకు కూడా బాలీవుడ్ పిచ్చి పట్టింది.  రాశీ ఖన్నా, తమన్నా వంటి వారు హిందీలో అడపా దడపా మెరుస్తుంటే రష్మిక కూడా అదే రూట్ లో వెళ్తున్నారు.  తమన్నా ముంబై అమ్మాయి, రాశీ ఢిల్లీ అమ్మాయన్న విషయం మరచి, తాను కూడా మరో రేఖ, జయప్రద, శ్రీదేవిలా వెలగాలని తెగ ఆశపడుతున్నారు రష్మిక.

- Advertisement -

టాలెంట్, అందం రెండూ ఉన్నా హిందీ ఇండస్ట్రీలో తెలుగు వారిని అంత త్వరగా ఎంకరేజ్ చేయరు.  కానీ ‘ముంబై డ్రీమ్స్’ మొదలైతే ఇవేవీ వీరికి పట్టవు, అలా స్ట్రగ్లింగ్ యాక్ట్రెస్ గా తెగ తిప్పలు పడుతూనే ఉంటారు.  రీసెంట్ గా ఇలియానా, పూజా హెగ్డే, కీర్తి సురేశ్ (పాపం ‘మైదాన్’ తో హిందీలో ఎంట్రీ ఇవ్వాల్సిన ఈమెకు లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చారు బోనీ కపూర్) వంటి వారు ఎలా డిజాస్టర్ అయ్యారో తెలిసినా రష్మిక మాత్రం ముంబై సినిమాలో గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

ఆమధ్య అమితాబ్ బచ్చన్ తో చేసిన సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది, నో రెస్పాన్స్, ఇక మ్యూజిక్ వీడియో, యాడ్స్ తో మాత్రమే సరిపెట్టుకునే పరిస్థితుల్లో ఈమెకు ఒకటి రెండూ హిందీ సినిమా ఛాన్సులు వచ్చిపడ్డాయి.  నెక్ట్స్ సినిమా హిందీలో అర్జున్ కపూర్ హిట్ తో మంచి జోష్ మీదున్న షాహిద్ కపూర్ అని రష్మిక హ్యాపీగా ఉన్నారు.  అనీస్ బాజ్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఈ సినిమా జస్ట్ ఓ యాక్షన్ కామెడీగా వస్తోంది.  అయితే ఇందులో హీరో షాహిద్ కపూర్ డబుల్ యాక్షన్ అంటే ఇద్దరు హీరోయిన్స్ లో రష్మిక ఒకతి అంతే. గుడ్ బై, మిషన్ మజ్నూ వంటి సినిమాలు డిజాస్టర్ కావటంతో రష్మిక ఇమేజ్ బాలీవుడ్ లో ఏమాత్రం సెట్ కాలేదు, మరోవైపు అనిమల్ లో రణబీర్ కపూర్ తో తన లక్ ట్రై చేసుకుంటున్నారు.

అయితే ఇదో బిగ్ ప్యాన్ ఇండియా మూవీ. ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమా కావటంతో ఇది తొలి ప్యాన్ ఇండియా కామెడీ మూవీగా సెన్సేషన్ క్రియేట్ చేసేలా అనీస్ బాజ్మీ ప్లాన్ చేస్తున్నారనేది మాత్రమే ఈమెకు ఊరటనిచ్చే విషయం.  అన్నట్టు ఈ సినిమాకు చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు.  దిల్ రాజు, ఏక్తా కపూర్ కూడా ఆ మల్టీ ప్రొడ్యూసర్స్ లో భాగమే.  మరి ఇలా ఒకటి అరా హిందీ సినిమాల కోసం టాలీవుడ్, కోలివుడ్ ను రష్మిక వదులుకుంటారా అంటే ఏమో వదులుకోవచ్చు, ఎందుకంటే ఆల్రేడీ శాండిల్ వుడ్ ను వదులుకున్న ఈ ‘శ్రీవల్లి’కి ఇలా ఇంకో ఇండస్ట్రీని వదులుకోవటం కొత్త, కష్టం ఏమీ కాదని ఇండస్ట్రీలో ఆల్రెడీ టాక్ స్టార్ట్ అయిందిలెండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News