Tuesday, May 21, 2024
Homeచిత్ర ప్రభAllu Arjun-Trivikram: బన్నీ-త్రివిక్రం కాంబో 4వ సారి

Allu Arjun-Trivikram: బన్నీ-త్రివిక్రం కాంబో 4వ సారి

పుష్ప 2, గుంటూరు కారం తరువాత సెట్ పైకి

డ్రీం టీం అని పాపులర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ జోడీ మరోమారు ఆడియన్స్ కు వినోదం పంచేందుకు సిద్ధమైనట్టు అధికారిక ప్రకటన వెలువడింది.  వీరిద్దరి కాంబోలో ఇప్పటికే 3 సినిమాలు రాగా 4వ సినిమా పట్టాలు ఎక్కడం బన్నీ ఫ్యాన్స్ కు గురుపూర్ణిమ రోజు గుడ్ న్యూస్ గా మారింది.  జులయ్, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం అనే బ్లాక్ బస్టర్స్ తో ఎంటర్ టైన్ చేసిన వీరిద్దరూ పవర్ ప్యాక్డ్ జంటగా పేరుగాంచారు.  యాక్షన్, సూపర్ స్టోరీ, డైలాగ్స్, మ్యూజిక్ తో వీరు తెలుగువారికి పంచే వినోదం అంతా ఇంతా కాదు.  డైనమిక్ డువోగా ఐకన్ స్టార్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరపైన చేసే కొత్త సందడిపై అప్పుడే అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి.  సినిమా రిలీజ్ ఎప్పుడనేదానిపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేనప్పటీ పుష్ప-2తో బన్నీ, మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ సినిమాతో త్రివిక్రం బిజీగా ఉన్నారు.  ఈ రెండు సినిమాల తరువాతే బన్నీ-త్రివిక్రమ్ సినిమా అన్నమాట.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News