Rashmika Mandanna: రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న రిలీజ్ కాబోతుంది. రష్మిక తెలుగులో చేసిన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా కనిపించబోతున్నాడు. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ట్రైలర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే కెరీర్‌లోనే మోస్ట్ ఎమోషనల్ రోల్‌ను ఈ సినిమాలో రష్మిక మందన్న చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
కాగా ది గర్ల్‌ఫ్రెండ్ మూవీలో రెమ్యూనరేషన్ తీసుకోకుండా రష్మిక మందన్న నటించిదట. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ఈ సీక్రెట్‌ను ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని రివీల్ చేశారు. “ది గర్ల్‌ఫ్రెండ్ కథ విని రష్మిక ఓకే చెప్పిన తర్వాత రెమ్యూనరేషన్ గురించి మాట్లాడటానికి ఆమె మేనేజర్‌ను కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించాను. కానీ ఆయన సరిగా రెస్పాండ్ కాలేదు. దాంతో డైరెక్ట్‌గా రష్మిక దగ్గరకు వెళ్లి ఆమెను కలిశాను. రెమ్యూనరేషన్ గురించి చెప్పగానే… ముందు సినిమా తీయండి. రిలీజైన తర్వాత నాకు రెమ్యూనరేషన్ ఇవ్వండి అని అన్నది. రెమ్యూనరేషన్ కోసం సినిమా చేయలేదని చెప్పి మాలో కాన్ఫిడెంట్ నింపింది” అని ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇదే ట్రైలర్ ఈవెంట్‌లో గర్ల్‌ఫ్రెండ్ ప్రీ రిలీజ్ వేడుకకు విజయ్ దేవరకొండను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించబోతున్నట్లు మూవీ ప్రజెంటర్ అల్లు అరవింద్ ప్రకటించారు.
Also Read – Kurnool bus accident: వీడిన మిస్టరీ.. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణాలు ఇవే.. జిల్లా ఎస్పీ వివరణ..!
విజయ్ దేవరకొండ ఈవెంట్‌కు వస్తే బాగుంటుందని అనిపిస్తుందని అల్లు అరవింద్ అన్నారు. ఇటీవలే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంగేజ్‌మెంట్ తర్వాత వీరిద్దరు కలిసి జంటగా కనిపించబోతున్న ఫస్ట్ ఈవెంట్ ఇదే కాబోతుంది. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఏం మాట్లాడుతాన్నరన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
కాగా నటుడిగా అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ చిలసౌ మూవీతో డైరెక్టర్‌గా మారాడు. తొలి సినిమాతోనే హిట్టు అందుకున్నాడు. స్క్రీన్‌ప్లే విభాగంలో చిలసౌ మూవీ నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత నాగార్జునతో మన్మథుడు 2 మూవీని రూపొందించారు. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సీక్వెల్ డిజాస్టర్ కావడంతో దాదాపు ఆరేళ్ల పాటు మెగాఫోన్‌కు దూరంగా ఉన్నారు. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి దర్శకత్వం వహిస్తూనే ఇందులో ఓ కీలక పాత్ర చేశాడు రాహుల్ రవీంద్రన్.
Also Read – Nagula Chavithi: నాగుల చవితి రోజు అద్భుత దృశ్యాలు.. కళ్లారా చూసి తీరాల్సిందే


