Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 3న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో అభిమానులు చాలా మంది విజయ్, రష్మిలకు కంగ్రాట్స్ చెప్పారు. ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నతో పాటు వారి కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగని ఈ పుకార్లను ఖండించలేదు. దాంతో వీరి ఎంగేజ్‌మెంట్ నిజమేనంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు.
పుట్టపర్తిలో…
ఇటీవల పుట్టపర్తి వెళ్లారు విజయ్ దేవరకొండ. తనకు చదువు చెప్పిన టీచర్స్‌తో పాటు చిన్ననాటి స్నేహితులను కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ ఫొటోల్లో విజయ్ చేతికి గోల్డ్ రింగ్ కనిపించింది. అది ఎంగేజ్‌మెంట్ రింగ్ అంటూ వార్తలొచ్చాయి. తాజాగా తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న ఓ వీడియోను రష్మిక మందన్న శుక్రవారం ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో థామా మూవీలోని నువ్వు నా సొంతమా అనే పాట గురించి ప్రస్తావించింది. థామా షూటింగ్‌లో ఉండగా తాను ఈ పాట విన్నానని, తనకు ఎంతో ఇష్టమైన సాంగ్ ఇదేనని చెప్పుకొచ్చింది. ఈ వీడియోలో రష్మిక మందన్న చేతికి డైమండ్ రింగ్ కనిపించింది. పదే పదే డైమండ్ రింగ్‌ను చూపిస్తూ రష్మిక మందన్న ఈ వీడియోలో కనిపించింది. తన ఎంగేజ్‌మెంట్ జరిగిందని ఈ వీడియో ద్వారా రష్మిక మందన్న ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చిందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read – Shraddha Das: శ్రద్దా దాస్ అందాల మోత.. కుర్రకారు గుండెల్లో గిలిగింత..
ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను చూపించడానికే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మిక పోస్ట్ చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో ద్వారా నిశ్చితార్థాన్ని రష్మిక కన్ఫామ్ చేసిందని పేర్కొంటున్నారు. పెళ్లి ఎప్పుడో చెప్పాలంటూ చాలా మంది నెటిజన్లు రష్మిక వీడియోను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక పోస్ట్ చేసిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతోంది. ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి జరుగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హ్యాట్రిక్ మూవీ…
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల మొదలైంది. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్, రష్మిక కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. మరోవైపు రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ హారర్ మూవీ థామా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ మూవీలో నవాజుద్ధీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషించాడు.


