Rashmika Mandanna: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ మూవీ గురువారం (నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. గౌతమ్ తిన్ననూరి టేకింగ్, స్టోరీతో పాటు అనిరుధ్ బీజీఎమ్, విజయ్ దేవరకొండ, సత్యదేవ్ యాక్టింగ్ బాగున్నాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రష్మిక ఎమోషనల్ పోస్ట్…
చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో అతడి ఫ్యాన్స్ సైతం ఖుషి అవుతోన్నారు. కింగ్డమ్ మూవీ రిజల్ట్‌పై రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. విజయ్.. నీకు, నిన్ను అభిమానించే వారికి ఈ సక్సెస్ ఎంత ప్రత్యేకమైనదో నాకు తెలుసు అంటూ ట్వీట్ చేసింది రష్మిక మందన్న. మన కొట్టినం అంటూ తెలంగాణ యాసలో పేర్కొన్నది. రష్మిక మందన్న ట్వీట్‌కు మనం కొట్టినం అంటూ విజయ్ రిప్లై ఇచ్చాడు. లవ్ ఎమోజీని జోడించాడు. ట్విట్టర్‌లో వీరిద్దరి మధ్య సాగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రష్మికతో పాటు విజయ్ ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి.
Also Read – Telugu Webseries: ఆగస్ట్‌లో రిలీజ్ కానున్న తెలుగు వెబ్‌సిరీస్‌లు ఇవే – వీటిని అస్సలు మిస్సవ్వొద్దు!
పెళ్లి డేట్ ఎప్పుడూ…
ఈ ట్వీట్‌తో విజయ్, రష్మిక ప్రేమ, పెళ్లి వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. అప్పుడే మనం అయిపోయారా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంకేటి లేట్… మ్యారేజ్ డేట్ ఎప్పుడు చెబుతారు అంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు.
గీత గోవిందం…
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కలయికలో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల షూటింగ్ టైమ్‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిన వేడుకల్లో రష్మిక పాల్గొనడం, పలుమార్లు జంటగా వీరిద్దరు మీడియా కంటపడటంతో డేటింగ్ వార్తలను బలాన్ని చేకూర్చింది. అయితే ఈ ప్రేమాయణంపై విజయ్, రష్మిక ఇప్పటివరకు పెదవి విప్పలేదు.
హ్యాట్రిక్ మూవీ…
తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ రాబోతున్నట్లు టాలీవుడ్‌లో వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. టాక్సీవాలా తర్వాత డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్‌తో ఓ హిస్టారికల్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read – Hari Hara Veera Mallu: చిరంజీవి బర్త్‌డే రోజు ఓటీటీలోకి హరిహరవీరమల్లు? – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
నాలుగు సినిమాలు…
మరోవైపు తెలుగులో పుష్ప, కుబేర, హిందీలో యానిమల్, ఛావా సక్సెస్‌లతో రెండు భాషల్లో టాప్ హీరోయిన్‌గా మారింది రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగులో ది గర్ల్‌ఫ్రెండ్, మైసా సినిమాలు చేస్తుంది. మరో రెండు బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించబోతున్నది.


