Friday, April 11, 2025
Homeచిత్ర ప్రభRashmika Mandanna : నన్ను ఎవ్వరూ బ్యాన్ చేయలేదు.. నా వ్యక్తిగత జీవితం ప్రజలకి అనవసరం..

Rashmika Mandanna : నన్ను ఎవ్వరూ బ్యాన్ చేయలేదు.. నా వ్యక్తిగత జీవితం ప్రజలకి అనవసరం..

- Advertisement -

Rashmika Mandanna : ఇటీవల కన్నడ నటుడు రిషబ్ శెట్టి, హీరోయిన్ రష్మిక మధ్య వివాదం ముదిరింది, రష్మిక తన హోమ్ స్టేట్ సినిమాలకి రెస్పెక్ట్ ఇవ్వలేదంటూ రష్మికని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేశారని వార్తలు వచ్చాయి. అన్ని పరిశ్రమలలోని ఈ వార్త గట్టిగానే వినపడింది. రష్మికని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేశారని చాలా రోజుల నుంచి అంటున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు.

తాజాగా రష్మిక మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలపై స్పందించింది. రష్మిక మాట్లాడుతూ.. కన్నడ చిత్ర పరిశ్రమ నాపై ఎలాంటి నిషేధం విధించలేదు. కాంతార సినిమా విషయంలో నాపై కొంతమంది అత్యుత్సాహం చూపించారు. కాంతార సినిమా చూసి చిత్ర బృందానికి నేను మెసేజ్ పెట్టాను. నటీనటుల మధ్య ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను. మెసేజ్ లు కూడా బయటికి రిలీజ్ చేయలేను. నా వ్యక్తిగత జీవితం ప్రజలకు అవసరం లేదు. వృత్తిపరంగా మాత్రమే నేను ఏం చేస్తున్నానో అది ప్రజలకు చెప్పడం నా బాధ్యత అని తెలిపింది.

దీంతో తనపై కన్నడ పరిశ్రమలో ఎలాంటి బ్యాన్ విధించలేదని రష్మిక క్లారిటీ ఇచ్చింది. ఇన్నాళ్లు ఇది నిజమో కాదో అని కంగారుపడ్డ రష్మిక అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News